నిలుచున్న పాట్నే పాటందుకొని
వాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దు
వాగుడు గుల్లల సంద్రాన మణిగి
ఇంత రొదలోనూ తొణకని సద్దు

భూమిలోకంటా చూస్కుంటా
గీట్లను అటూఇటూ కలబెడుతూ…
భూమిలోకంటా చూస్కుంటా
చుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..
భూమిలోకంటా చూస్కుంటా
అదాటున మాటలాడుతూ…

చూసినవాళ్లు అన్నారు కదా!
‘ప్రేమించడమంటే అట్టా..
చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!
బాటా కు
మనిషంటే అట్టా…
కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూ
పిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!
తూటాకు శాంతి మొలిస్తే అట్టా…

జంగమస్థానం కోసం జల్లెడ
పట్టిన నెత్తుట మెత్తని నెత్తావి
మట్టి వాసనలేసే మౌనానికి
మాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!

రివేరా
+ posts

One thought on “సిగ్గరి పొద్దు

Leave a Reply