సి.యస్‌.అర్‌.ప్రసాద్‌ అనువాదం చేసిన  దివ్యా ద్వివేది, షాజ్‌ మోహన్‌, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం

ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది.

            హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు.  హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక  భౌతిక వాద దృక్పథంతో, 

మార్క్సియన్‌ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి  భారతీయ హిందూత్వ ఆధిపత్య అగ్రకులమత సాంప్రదాయ మూలాలను వెతికి చూపించారు. దీని కోసం వీరు ఎన్నో చారిత్రక గ్రంథాలను తులనాత్మకంగా పరిశోధించి, పరిశీలించి విశ్లేషించి  పాఠకులకు అందించారు.

            ఈ చిన్న పుస్తకంలో హిందూ ఫాసిస్ట్‌ సంస్కృతి, మరొకవైపు సామ్రాజ్యవాద సంస్కృతి దేశ ప్రజలపై స్వారీ చేస్తున్న వైరుధ్యాన్ని తార్కిక తాత్విక దృక్పథంతో చర్చించాలన్న ప్రశ్న అంతర్లీనంగా ఇమిడి ఉంది.

            బాబ్రీ మసీదు విషయంలో రచయితలు ఈ పుస్తకంలో ఇచ్చిన వివరణ .. ఫైజాబాద్‌లో ఒకప్పుడు ఆ స్థలంలో 16వ శతాబ్దానికి చెందిన మసీదు ఉండేది. ప్రస్తుత పాలక భాజపాతో సహా వివిధ హిందూ సంస్థల నాయకుల ఆధ్వర్యంలో ఒక గుంపు ఆ మసీదును 1992లో కూల్చి వేసింది.  ఈ మసీదు నిర్మాణానికి, కూల్చివేతకు మధ్య దాదాపు నాలుగు శతాబ్దాల అంతరం ఉంది.  ఈ మధ్య కాలంలో ఏమి జరిగిందో వివరించడానికి పూర్తిగా  చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. దాని మీద హిందుత్వ వాదులు అనేక అబద్ధాలు చెప్పారు. వక్రీకరణలు ప్రచారం చేశారు. చరిత్రను ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు అనేక అబద్ధాల మీద ఎట్లా పని చేస్తున్నదో వివరించే ప్రయత్నం చేశారు. అందుకే ఈ పుస్తక రచయితల హిందుత్వ ఒక అబద్ధం అన్నారు. 

            ఈ పుస్తకం పాఠకులలో చారిత్రక దృష్టిని కల్పింస్తుంది. చైతన్యవంతం చేస్తుంది. సనాతన వైదిక సంస్కృతిని  నిశితంగా నిష్పక్షపాతమైన విమర్శనా దృష్టితో పరిశీలించి, పరిశోధించి నిగ్గుతేల్చి అనేక విషయాలు చెప్పారు. 

            ఈ రచయితలు మరో చారిత్రక సంఘటనను పేర్కొంటూ ‘‘ పంజాబ్‌ జనాభా లెక్కల కమిషనర్‌ డెంజిల్‌ ఇబిల్‌ స్టన్‌(ణవఅఓఱశ్రీ శ్రీపపవర్‌శీఅ) 1881లో ‘హిందూ’ అనే పదమే అర్థం లేని పదం అన్నారు. దీన్ని మైకేల్‌ హన్‌ అనే సామాజిక శాస్త్రవేత్త 2005 లో రాసిన ఒక వ్యాసంలో ఊటకించారు.’’  అని రచయితలు పేర్కొన్నారు.

అలాగే (20 వ పేజీలో) ‘‘ తమను గుర్తించడానికి ఈ కొత్త మత శబ్దాన్ని వాడడం అనేక మంది అగ్రకుల భారతీయులకు 1890లలో ఎరుక కలిగింది’’  అని రచయితలు తెలియజేశారు.

 జూలై 1894 నాటి కలకత్తా రివ్యూ లోని ‘‘ది క్రిటికల్‌ నోటీసు’’లో ‘హిందూత్వ’ అనే పదాన్ని 1892లో చంద్రనాథ్‌ బసు అద్వైత వేదాంత ఆలోచన విధానాన్ని ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారు. హిందూత్వ

పదాన్ని తమ సమకాలికులైన జాతీయోద్యమ రాజకీయ నాయకులు బాలగంగాధర్‌ తిలక్‌, మదన్‌ మోహన్‌ మాలవ్య, వారి తర్వాత  వి.డి. సావర్కర్‌, ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌, హెగ్డేవార్‌ లాంటివారు విస్తృతంగా ప్రచారం చేశారు. వి.డి. సావర్కర్‌ 1923లో ‘‘ఎసెన్షియల్‌ ఆఫ్‌ హిందూత్వ’’అనే పేరుతో 1928లో పునర్ముద్రణలో ‘‘హిందూత్వ: హూ ఈజ్‌ ఎ హిందూ’’సిద్ధాంత గ్రంథంగా బీజాలు వేసిన నాటి సావర్కర్‌ సిద్ధాంతానికి ప్రభావితుడైన హిందూ మహాసభ కార్యకర్త,  రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యుడైన నాథూరామ్‌ గాడ్సే   30 జనవరి 1948 నా గాంధీని హత్య చేశాడు.  అందుకు ప్రధాన కారణం 1947లో భారత దేశ విభజన సమయంలో బ్రిటిష్‌ ఇండియా ముస్లింల రాజకీయ డిమాండ్లను గాంధీ సమర్థించారని తన విచారణలో పేర్కొన్నాడు.

            ఆర్‌ఎస్‌ఎస్‌ పునాదిని అనేక కోణాల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన వివరాల్ని పరిశోధించి దాని స్వరూప స్వభావాల్నీ, దాని క్రమపరిణామాన్నీ  ఈ చిన్న గ్రంథంలో వివరిస్తూ కల్పిత దైవంశ సంభూతమైన హిందుత్వవాదుల అశాస్త్రీయ శక్తిని శాస్త్రీయ దృక్పథంతో  చరిత్ర ఏమిటో  మన ముందు ఉంచారు.

     అనువాదం గురించి:

 సి ఎస్‌ ఆర్‌ ప్రసాద్‌ ప్రసాద్‌  శైలి చాలా సరళమైనది. చాలా సులభంగా పాఠకులకు చెప్పడానికి ఆయన అనువాద కళను అభివృద్ధి చేసుకున్నారు. అనువాద ప్రక్రియ గురించి వల్లంపాటి వెంకటసుబ్బయ్య  ‘‘రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము.’’  అన్నారు. సి ఎస్‌ ఆర్‌ ప్రసాద్‌  అనువాదం సొంత రచనన్నంతగా ఆయన భాషా శైలి ఉంటుంది. తద్వారా పాఠకుల అవగాహనను  కొత్త ఎత్తులకు తీసుకువెళ్తారు.

Leave a Reply