రక్త సంబంధీకులకు..
ఈ నేలకు చెందిన నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మీ కోసం నేనురాసే ఒక బహిరంగ లేఖ. మీకీ లేఖ రాయాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను. చాలా కాలం నుంచి రాయకుండా ఈ లేఖ అలా ఉండిపోయింది. మా సంస్థలో రొట్టెలు కాలుస్తున్నప్పుడు నా శరీరం కాలడంతో తొలిసారిగా నా కలాన్నిలా కదిలించాను. అమ్మా.. నీ అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్నప్పుడు నీకు రాయాలనుకున్నాను. ధనికులుగా, పేదలుగా, స్త్రీలుగా పురుషులుగా విభజించే విధానం పెరిగిపోతుండడం గురించి మా సంస్థలో తొలిసారిగా చర్చించాం. మన సమాజంలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ చణలో వీటిని ఎలా