కథలు

కొత్త బంగారు లోకం

సూర్యుడు పడమర దిక్కున ఎరుపు రంగులోకి మారుతూ, మెల్లమెల్లగా కిందికి జారుకుంటున్నాడు. అప్పుడు సమయం 6 గంటలు. 5, 6 ఇండ్లున్న ఆదివాసీ గ్రామం చేరుకున్నాం. నేను బాబాయ్‌, మమల్ని తీసుకొచ్చిన అన్నయ్య, మేము కలవాల్సిన వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్‌లో మాట్లాడక, మెసేజ్‌ చూసుకోక సరిగ్గా 48 గంటలవుతోంది. వాచ్‌ ప్రతి గంటకు శబ్దం చేయగానే, నాకేదో మెసేజ్‌ వచ్చినట్లుగా నా చూపులు సైడ్‌ బ్యాగ్‌ వైపు వెళుతున్నాయి. తీరా వాచ్‌ సౌండ్‌ అని ఓ లుక్‌ వాచ్‌పైకేసా. నేనొచ్చే ముందు డిజిటల్‌ వాచ్‌ ఐతే అక్కడి ప్రదేశానికి అనుకూలమని మా పిన్ని కొనిచ్చింది. డిజిటల్‌
సంపాదకీయం

పాలస్తీనా సందర్భంలో ప్రమాదకరంగా మారిన సోషల్‌ మీడియా

భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్‌ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్‌ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్‌ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌ పక్షం తీసుకుని భారతీయులు సోషల్‌ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్‌ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని
వ్యాసాలు

బొగ్గు గనుల జిల్లాలోప్రమాదకర స్థితిలోజనజీవనం

మధ్య భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం మొదలుకాక ముందు, హస్దియో అరంద్ డజను ఆదివాసీ కుగ్రామాలు వున్న మారుమూల అడవి. 650 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిని "మధ్య భారతదేశ ఊపిరితితిత్తి" అని పిలుస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులతో పాటు, అమూల్యమైన నీటి నిల్వలు వుండేవి. స్థానిక గ్రామస్తులలో చాలా మంది ఆదివాసీలు లేదా గోండు తెగకు చెందిన "ఆదిమ నివాసులు". వారు తమ పెరట్లో పంటలు పండిస్తారు, నేసిన గడ్డి బుట్టలను మార్కెట్‌లో అమ్ముకొంటారు. వారికి తమ భూమి చాలా పవిత్రమైనది. హస్డియో అరణ్య అడవులలో, కొత్త బొగ్గు
వ్యాసాలు

సిజిమాలి తిరుగుబాటు

వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్; పోలీసుల బెదిరింపులను సవాలు చేసిన ఒడిశా గ్రామస్తులుఒడిశాలో, కార్పొరేట్ ప్రయోజనాలు, అక్రమ మైనింగ్, అన్యాయమైన నిర్బంధాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే గ్రామస్థుల అద్భుతమైన దృఢ సంకల్పాల గాథ పురివిప్పుతోంది. సిజిమాలి కొండలకు సమీపంలో ఉన్న ఈ సముదాయాలు తమ జీవన విధానానికి ముప్పు కలిగించే మైనింగ్ ప్రాజెక్టుల ప్రతికూల పర్యావరణ ప్రభావాలకు భయపడి కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా నిలబడాలని ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంతో, ఈ కథనం ఒడిశాలోని గ్రామస్తులు తమ భూమి, జీవనోపాధి, హక్కులను కాపాడుకోవాలనే తపనలో కార్పొరేట్ ప్రభావాన్ని ధిక్కరిస్తున్నారు. వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్: సిజ్మాలిలో నిల్వ చేయబడిన 311
వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా
వ్యాసాలు

హమాస్‌ దాడులను ఎలా చూడాలి..?

‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది. వాకిలి నీదైనా నాదైనా, దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా అది ఆదాము నెత్తురే కదా యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. గాయపడేది మానవాత్మే కదా మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ అంటూ 1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు. నిజమే కదా యుద్ధ భీభత్సం
కవిత్వం

ఎర్రమందారం

సింగరేణీ కార్మిక వర్గంలో మొలకెత్తిన ఎర్రమందారం నీవైతే నీవు వెదజల్లే ఆ పరిమాళానికి వీచే గాలిని నేనవనా కామ్రేడ్ నా విప్లవ పయనానికి నడక నేర్పిన సాయుధ శక్తివి నీవైతే ఆ పయనంలో పీడిత ప్రజల ముక్తిని సాధించే బందూకునేనవనా కామ్రేడ్ సాధారణ సుదర్శన్ నుండి కా.ఆనంద్ గా, దూల గా 5 దశాబ్దాల అలుపెరుగని జన పోరు సంద్రంలో నూతన ప్రజాస్వామ్యాన్ని వాగ్ధానం చేసిన దృఢమైన విప్లవ కార్యదీక్ష నీవైతే ఆ లక్ష్యాన్ని అల్లుకునే కార్మికవర్గ స్పర్శను నేనవనా కామ్రేడ్ భారత విప్లవోద్యమ సారధిగా యుద్ధ రచన చేసిన నీ ప్రతి అక్షరం కుళ్ళిన ఈ దోపిడీ
వ్యాసాలు

మోహన్ జీ అజరామర జ్ఞాపకాలు

కామ్రేడ్‌ ఆనంద్‌ నాకు మొదటిసారి ఓ సమావేశంలో  పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో   సృష్టించిన మొదటి సంక్షోభం  పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్‌ నుండి నేను, మరికొందరు అదిలాబాద్‌ నుండి కామ్రేడ్‌ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి  మరికొందరు  హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి  సమయంలో   సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్‌ విప్లవోద్యమానికి  ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో   ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు 
సమీక్షలు

ప్రజా దృక్పథం లేని ‘భిన్న దృక్పథాలు’

పర్స్ పెక్టివ్స్ సంస్థ ప్రచురించిన అనువాద వ్యాసాల సంకలనం ‘భిన్న దృక్పథాలు’ భారత విప్లవోద్యమం   చేస్తున్న ప్రజాయుద్ధం గురించి అసమగ్రమైన, స్వీయాత్మకమైన, ప్రజా వ్యతిరేకమైన, వర్గ సామరస్యపూరితమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని వ్యాసాలు, కొన్ని అంశాలు మినహాయిస్తే, ప్రధానంగా, దేశ విశాల పీడిత ప్రజల దృష్టికోణంతో విప్లవోద్యమం కార్యాచరణను చూడలేకపోయింది. ప్రజల విముక్తి కోసం తప్పనిసరి అయిన విప్లవ దృక్పథం నుంచి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. సామాజిక మార్పు కోసం జరుగుతున్న లోతైన విప్లవ క్రమం గురించి చర్చించేందుకు అవసరమయిన వర్గ దృష్టితో విషయాలను విశ్లేషించలేదు. ఇది వర్గాల మధ్య సాగుతున్న యుద్ధంగా కాకుండా, మనుషుల మధ్య
సమీక్షలు కొత్త పుస్తకం

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది