ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది?

దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది.

నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో – తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం అబూజ్‌మాడ్ పరిధిలోకి వస్తుంది.

ఓటింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఇక్కడి ప్రజలు కూడా ఈ ఉద్యమంలోభాగస్వాములవుతున్నారు. నారాయణపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మినహా మరో 10 పార్టీలు నామినేషన్‌లు దాఖలు చేశాయి. సాధారణ ప్రజానీకం అభిప్రాయం ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. అయితే గత రెండేళ్లలో నారాయణపూర్‌లో జరిగిన ఘటనలన్నింటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపిస్తుందని అనుకుంటున్నారు.

ప్రధానంగా మూడు డిమాండ్లపై నిరసనలు జరుగుతున్నాయి

గత ఐదేళ్లలో రావ్‌ఘాట్ గని త్రవ్వకాల పనులు కూడా మొదయ్యాయి. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఛోటా డొంగర్‌కు చెందిన ఇకో కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ట్రక్కును కాల్చేసారు. మూడంచెల డిమాండ్ల కోసం ఆదివాసీలు ఆందోళనకు దిగారు. గత మే నెలలో, ‘జన్ చౌక్’ బృందం నారాయణపూర్‌లోని మధోనార్ నిరసన ప్రదేశానికి చేరుకుంది. ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా మరోసారి ‘జన్ చౌక్’ బృందం నిరసన స్థలాన్ని పరిశీలించి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.

తోయ్‌మెటా నిరసన ప్రదేశం నారాయణపూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం లోపలికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో, రోడ్డు అబూజ్‌మాడ్ వైపు తిరిగిన వెంటనే, మంచి రోడ్డు మనల్ని వదిలేస్తుంది, ఎర్రటి మట్టి, చిన్న గులక రాళ్లతో చేసిన బాటలో నడవాల్సి వస్తుంది. కొండల మధ్య ఉన్న ఈ నిరసన ప్రదేశంలో అనేక గుడిసెలు వేసారు. తమ డిమాండ్ల కోసం గత ఏడాది కాలంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న గిరిజనుల మూడు అంశాల డిమాండ్లు ఇలా ఉన్నాయి.

  • ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 1996లో ఆమోదించిన పెసా చట్టం నిబంధనలను వెంటనే అమలుచేయాలి.
  • గ్రామసభ అనుమతి లేకుండా ప్రతిపాదిత కొత్త పోలీసు క్యాంపులు, రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి.
  • 2002లో ఆమోదించిన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలి.

ఈ సమస్యలపై నిరసనలో కూర్చున్న ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రదర్శనలో కూర్చున్న కొందరికి ఓటరు కార్డులు ఉన్నాయి కానీ కొందరికి లేవు.

ముందుగా డిమాండ్లను ఆమోదించండి, తర్వాత ఓటేస్తాం.

‘జన్ చౌక్’ బృందం నిరసన ప్రదేశానికి చేరుకున్న రోజు, ఫూల్ సింగ్,రాయ్‌త్రామ్ గోటాలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికలగురించివారితో మాట్లాడాం. ఎన్నికల సమయంలోనూ తమ డిమాండ్లు మారలేదన్నారు. “ప్రభుత్వం ఎవరిదైనా సరే ముందుగా మా మూడు అంశాల డిమాండ్లను ఆమోదించాలని కోరుతున్నాం. ఆ తర్వాత మా సంఘం ఓట్లు మొత్తం వారికే వేస్తాం. లేకుంటే బహిష్కరిస్తాం.”
ఓటు వేయడానికి వెళతారా అని మేము ఫూల్ సింగ్ ‌ను అడిగితే “మేం ఎన్నడూ ఓటింగ్‌ను బహిష్కరించలేదు. ప్రతిసారీ ఓటు వేయడానికి వెళ్తాం. ప్రభుత్వం మా డిమాండ్లపై దృష్టి సారిస్తే ఈసారి కూడా ఓటేస్తాం” అని అన్నారు.

విద్యుచ్ఛక్తి, నీటి సమస్యలపై ఫూల్ సింగ్ మాట్లాడుతూ, 2019 నుండి లోతట్టు గ్రామాలకు విద్యుత్ వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌లమధ్య మాకు తేడా లేదుమా డిమాండ్లను అంగీకరించే వారే మాకు అండగా ఉన్నారన్నారు.
ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎన్నికలు వచ్చినప్పుడే అన్ని పార్టీలకు ఆదివాసీలు గుర్తొస్తారు. అప్పుడేవారి భద్రతపై దృష్టి సారిస్తామన్న అంశాన్ని లేవనెత్తుతారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకావుఅని చెప్పిన వీరే ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడగానే ఆదివాసీలను మరిచిపోతున్నారు. వారిని నక్సలైట్ అని జైల్లో పెడుతున్నారు. చాలాసార్లు అడవికి వెళ్ళారనే పేరుతో కూడా వేధిస్తున్నారు.

ఇంకా చాలా మందికి ఓటరు కార్డులు తయారు కాలేదు. ఫూల్ సింగ్ చెప్పారు. ఇది కూడా మాకు ముఖ్యమైన సమస్య. ప్రభుత్వం దీనిపై కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేదిఅని పూల్ సింగ్ అన్నారు.
ఈ ఉద్యమంలో నేతృత్వం వహిస్తున్న రాయ్‌త్రామ్ గోటా నారాయణపూర్‌లో నిరంతరం గనులను తెరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలోనే రావుఘాట్ గనులు మాత్రమే కాకుండా ఇతర గనులు కూడా తెరిచారని.. దాని వల్ల సామాన్య ఆదివాసీలకు ఏమీ ప్రయోజనం జరగలేదని అన్నాడు.

మేము ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ప్రభుత్వం మా గురించి ఏమీ పట్టించుకోదు. ఆదివాసీల భూమిలో త్రవ్విన గనుల వల్ల ప్రభుత్వానికే లాభం కలుగుతోంది. ప్రయోజనం మా ప్రజల సలహా మేరకే ఓటేస్తాం, అయితే ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి.

పెద్దగా ప్రభావం ఉండదు

నారాయణపూర్‌లో గత ఐదేళ్లుగా ఆదివాసీలు తమ డిమాండ్ల కోసం వివిధ చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు రావ్‌ఘాట్ గనులు కూడా మొదలయ్యాయి. ఈ నిరసనలు ఓట్లపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి బస్తర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టుతో మాట్లాడాం.తన పేరును ప్రచురించవద్దనే షరతుపై, అతను “నారాయణపూర్ అసెంబ్లీ స్థానం చాలా వైవిధ్యమైనది. ఇందులో కొంత భాగం బస్తర్, కొండగావ్ జిల్లాలలోకి వస్తుంది. యాదృచ్ఛికంగా, యిక్కడే ఎక్కువ ఓట్లు పడతాయి. నారాయణపూర్ జిల్లాలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఓర్చా బ్లాక్ ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది. అందువల్ల ఈ ప్రాంతం నుంచి ఓట్లు కూడా తక్కువే” అని వివరించారు.

ఆయన మాట్లాడుతూ, “నారాయణపూర్‌లో జరుగుతున్న నిరసనల్లో చాలా వరకు అబూజ్‌మాడ్పరిధిలోకి వస్తాయి. చాలా మందికి ఓటరు కార్డు కూడా లేదు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేకపోయింది. మరోవైపు, నక్సలైట్లు ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు, అందుకే చాలా మంది ఓటు వేయడానికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనది. అటువంటి పరిస్థితిలో దీనిని విస్మరించలేము. ”

నారాయణపూర్ అసెంబ్లీలో మొత్తం 1,76,030 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 85,425 మంది పురుషులు,90,604 మంది స్త్రీలు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన చందన్‌ కశ్యప్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య కేవలం రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండింది. ఇన్ని ఉద్యమాలు సాగుతున్న ఈసారి ఎన్నికలపై దాని ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.

Leave a Reply