నివేదిక

అడవిని నరికితే మాకు తిండి ఎలా?

హస్‌దేవ్‌ క్షేత్ర స్థాయి నివేదిక  “వాళ్ళు మెల్లమెల్లగా అడవి మొత్తాన్ని నరికివేస్తే, మేం ఎక్కడికి వెళ్తాం? సంపాదన ఎలా? ఏం తింటాం?” తమ అడవిని కాపాడాలంటూ హరిహరపూర్‌లో ఎంతో కాలంగా జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న హస్‌దేవ్ అరణ్యలోని  ఫతేపూర్‌ గ్రామ నివాసి సంత్‌రా బాయి వేదన ఇది. నగరాల్లో వెలుగునింపడానికి ఆదివాసీల హృదయాలు నివసించే గ్రామాలను నాశనం చేస్తున్నారనేదే సంత్‌రా బాయిని వేధిస్తున్న తీవ్ర  ఆందోళన. వాస్తవానికి, 170,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న హస్‌దేవ్ అడవిపైన కార్పోరేట్ చాలా కాలంగా కన్నేసింది. అందులో రెండున్నర లక్షల చెట్లను నరికాల్సి ఉంది. వాటిలో కొన్నింటిని యిప్పటికే నరికేసారు. డిసెంబరులో చలిగాలులు
వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా