వ్యాసాలు

జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థినుల పోరాటం

ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న జెండర్ వివక్షతను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు సంఘీభావం ప్రకటించి అండగా నిలవాల్సిన భాద్యత మనందరిపై ఉంది.మార్చి నెల ప్రాంరంభంలో హౕస్టళ్ళలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రారంభమైన విద్యార్థినుల ఉద్యమం నేడు స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం వైపు ప్రయాణం చేస్తూ తెలంగాణ సమాజం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ వైపు మరోసారి చూసే పరిస్థితి నెలకొంది.మార్చి 27 నాడు మద్యాహ్నం నుండి లేడిస్ హస్టల్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరవధిక దర్నాలో మద్దతుగా మేము పాల్గొన్నపుడు విద్యార్థులు లేవనెత్తిన అంశాలు మమ్మల్ని పోరాటంలోకి కదిలించాయి.ఆ దర్నాలో పాల్గొన్న విద్యార్థినులు వారిపై ఏ విధంగా అణచివేత సాగుతున్నదో చెబుతుంటే