వైకల్యం ఒక అస్థిత్వం
ఇది కరుణ అనుభవం.. అవగాహన.. సిద్ధాంత దృక్పథం. తనలోకి తాను చూసుకుంటూ ఈ ప్రపంచంలోకి, తన వంటి వారి ప్రత్యేక అస్థిత్వంలోంచి సకల పీడిత అస్థిత్వాల్లోకి కరుణ విస్తరించిన తీరు ఇది. ఒక మార్క్సిస్టు మేధావి విస్తరింపదల్చుకున్న వైకల్య రాజకీయమిది. అర్థాంతరంగా ఆగిపోయిన ఆయన ఆలోచనా ధార ఇది. వసంతమేఘం అంతర్జాల పత్రిక ఆరంభమైనప్పటి నుంచి కరుణ అనేక అభిప్రాయాలు పంచుకునేవాడు. మా కోరిక మేరకు ఒక కాలం రాస్తానన్నారు. ఏం రాయాలి? అని అనేక ఆలోచనలు పంచుకున్నారు. చివరికి *వైకల్య అస్తిత్వ రాజకీయాలు* రాస్తానన్నారు. మరణానికి ముందు రోజు *వి కలం* కాలానికి తొలి రచన పంపించారు. అందులో ఒక