మానవ హననం ఆపాలి…. శాంతి చర్చలు జరపాలి
*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు