నివేదిక

అడవిని నరికితే మాకు తిండి ఎలా?

హస్‌దేవ్‌ క్షేత్ర స్థాయి నివేదిక  “వాళ్ళు మెల్లమెల్లగా అడవి మొత్తాన్ని నరికివేస్తే, మేం ఎక్కడికి వెళ్తాం? సంపాదన ఎలా? ఏం తింటాం?” తమ అడవిని కాపాడాలంటూ హరిహరపూర్‌లో ఎంతో కాలంగా జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న హస్‌దేవ్ అరణ్యలోని  ఫతేపూర్‌ గ్రామ నివాసి సంత్‌రా బాయి వేదన ఇది. నగరాల్లో వెలుగునింపడానికి ఆదివాసీల హృదయాలు నివసించే గ్రామాలను నాశనం చేస్తున్నారనేదే సంత్‌రా బాయిని వేధిస్తున్న తీవ్ర  ఆందోళన. వాస్తవానికి, 170,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న హస్‌దేవ్ అడవిపైన కార్పోరేట్ చాలా కాలంగా కన్నేసింది. అందులో రెండున్నర లక్షల చెట్లను నరికాల్సి ఉంది. వాటిలో కొన్నింటిని యిప్పటికే నరికేసారు. డిసెంబరులో చలిగాలులు
నివేదిక

మైనింగ్ కోసం పసికందును చంపేస్తారా ? కార్పొరేటీకరణ,  సైనికీకరణ వ్యతిరేక వేదిక నిరసన సభ

బీహార్‌లోని కైమూర్‌లో పులుల అభయారణ్యం  ఏర్పాటుచేయాలనే సాకుతో  ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ లో  ఆదివాసీ రైతుల భూమిలో చెట్లు నరికివేయడానికి, భూసేకరణకు, వ్యతిరేకంగా 2024 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 6 నెలల పసికందు హత్యకు వ్యతిరేకంగా 2024 జనవరి 10న, కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్‌ఎసిఎఎమ్), ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్ ఫ్యాకల్టీలో నిరసన సభను నిర్వహించింది. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కార్పొరేట్ దోపిడిని మరింత తీవ్రతరం చేయడం కోసం, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అనేక పారామిలిటరీ క్యాంపులను  ఏర్పాటు చేసి వేలాది బలగాలను
నివేదిక

భిన్నాభిప్రాయాన్ని నేరమంటారా ?

మణిపూర్ లాంటి ఘటనలు బస్టర్ లో సుదీర్ఘ కాలంగా జరుగుతున్నాయని సోనీ సోరి తదితరులు తమ జైలు జీవిత చిత్రహింసల అనుభవాలను గుర్తు చేసుకుంటూ,  రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్)లో రిమాండ్  చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని రంగాల్లోనూ అమలవుతున్న రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం నాడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 35కి పైగా సంస్థల సమూహం అయిన 'రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్) సమావేశం జరిగింది. 'భిన్నాభిప్రాయాన్ని నేరపూరితం చేయడం
నివేదిక

నియాంగిరి  సురక్ష  సమితిపై  ఉపా కేసులు

నియాంగిరి  సురక్ష   సమితి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)(యూఎపిఎ) చట్టం కింద ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నియాంగిరి  సురక్ష    సమితి నాయకులు, మద్దతుదారులపై క్రూరమైన ఉగ్రవాద నిరోధక ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆగస్ట్ 5న, కలహండి జిల్లా లాంజిగఢ్ హాట్ నుండి స్థానిక ఆదివాసీ గ్రామస్తుల మధ్య ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, కృష్ణ సికాకా (గ్రామం పతంగ్‌పదర్) బారి సికాకా (గ్రామం లఖ్‌పదర్)లను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం,
నివేదిక

హర్యానాలోని న్యూహ్‌లో  హిందూత్వ కుట్ర

న్యూహ్‌లో 2023 జులై 3, సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన బ్రుజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తరువాత హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, జన్ హస్తాక్షేప్ ఆరుగురు సభ్యుల నిజ నిర్థారణ బృందాన్ని పంపించి పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జన్ హస్తాక్షేప్ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ సయీద్ నక్వి, జెఎన్‌యు ప్రొఫెసర్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త డాక్టర్ వికాస్ వాజ్‌పెయి, జర్నలిస్ట్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త అనిల్ దుబే, జర్నలిస్ట్ ఆస్థా, సతీష్, ప్రదీప్‌లు
నివేదిక

మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

( మణిపూర్ లో హింస ను "స్టేట్ -స్పాన్సర్డ్ " అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. " రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా
నివేదిక

‘అదానీ గో బ్యాక్!’

 'గొందుల్‌పారా' బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత 'గొందుల్‌పారా' బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు. అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని
నివేదిక

సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి,వెంకట్ రెడ్డి, సత్యలకు వ్యతిరేకంగాఅవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

SC 998 of 2018 IV మెట్రోపాలిటన్  సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు నా పేరు సయ్యద్ గపూర్,  CT నెంబర్ 6634.  నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను.  14.5.2023  నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను  కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు.  నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు.  కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను.  మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు.  మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్,  కృష్ణమూర్తి,  వెంకటరెడ్డి  నా ముఖం మీద కాళ్ళ మీద  తన్నారు. 
నివేదిక

సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పాదయాత్ర

బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు  జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్‌మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రేషన్, నీళ్లతో  బయలుదేరారు. అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో
నివేదిక

ఒడిశాలోని ఆదివాసీ గూడాల్లో  ఆహార సంక్షోభాన్ని బహిర్గతం చేసిన  ఓ చిన్నారి మరణం

ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్‌ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా