నియాంగిరి సురక్ష సమితిపై ఉపా కేసులు
నియాంగిరి సురక్ష సమితి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)(యూఎపిఎ) చట్టం కింద ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నియాంగిరి సురక్ష సమితి నాయకులు, మద్దతుదారులపై క్రూరమైన ఉగ్రవాద నిరోధక ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆగస్ట్ 5న, కలహండి జిల్లా లాంజిగఢ్ హాట్ నుండి స్థానిక ఆదివాసీ గ్రామస్తుల మధ్య ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, కృష్ణ సికాకా (గ్రామం పతంగ్‌పదర్) బారి సికాకా (గ్రామం లఖ్‌పదర్)లను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం,