నివేదిక

మూడేళ్లలో నాలుగోసారి డ్రోన్  దాడి

తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ