వ్యాసాలు

బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక సైనికచర్యలో మరణించిన బాల సైనికురాలు: ఆమె ఒక్కరే కాదు

మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో
వ్యాసాలు

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ట్రేడ్ యూనియన్ నాయకుడు అనిరుద్ధ్ అరెస్టు

కార్యకర్తల‘ఎరుపు ముద్ర’పైఆగ్రహం నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడం అతని సహచరుల, కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది; కార్యకర్తలపై ఎరుపు ముద్ర వేస్తున్నందుకు ప్రభుత్వ ఏజెన్సీలను విమర్శిస్తున్నారు. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 5న రాత్రి 10.30 గంటలకు చెన్నై వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్‌సి‌ఆర్ ఆధారిత మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్, మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎం‌జి‌ఎం‌ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు అనిరుద్ధ్ రాజన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది.. ఉత్తర
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో
సాహిత్యం వ్యాసాలు

చింతామణిపై నిషేధం చెల్లేనా?

సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.   కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్‌ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై
వ్యాసాలు

ఆదర్శమే అందం నిత్య నిర్వచనం  

స్త్రీ అంటే శరీరం కాదు అనుభవించే హృదయం, ఆలోచించే మెదడు ఉన్న మానవజీవి అని నమ్మే  వ్యక్తుల, సంస్థల తీవ్ర  నిరసనల మధ్య మరే ప్రజోపయోగ కార్యక్రమాలు లేవన్నట్లు తెలంగాణ ప్రభుత్వం  హైద్రాబాద్ లో ఈ ఏడాది మే7 నుండి  72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించ తల పెట్టింది. దీనిని తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టగల ఉత్సవంగా చూస్తూ 200కోట్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయింది. ఈ సందర్భంలో అందం గురించిన, శాస్త్రీయమైన , మానవీయమైన అవగహన కోసం  నిత్య వ్రాసిన “అందం - ఆదర్శం”  అనే కవితను పరిచయం చేయాలనిపించింది.  నిత్య కలం పేరు. తల్లిదండ్రులు పెట్టిన
వ్యాసాలు

భారతదేశంలో రాజకీయ ఖైదీలు: రాజ్య కుట్రపూరిత వ్యాజ్యాలు, ఏజెన్సీలు

5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు
వ్యాసాలు

14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు

14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్  కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది  2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు
వ్యాసాలు

సంస్కృతి – మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం

(విర‌సం 28వ మ‌హాస‌భ‌ల కీనోట్ పేప‌ర్‌లోని కొన్ని భాగాలు పాఠ‌కుల కోసం- వ‌సంత‌మేఘం టీం) సంస్కృతి ఉత్పత్తి :   సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి.  సంస్కృతిలో నుంచే  కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది.  అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా  సంస్కృతి  మనిషిని  పెనవేసుకొని ఉంటుంది.  సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది.  సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్‌ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో  కూడా
వ్యాసాలు

హిమాలయోన్నత అమరత్వం నంబాళ కేశవరావుది.

పీడిత ప్రజలకు కలలు కూడా ఉండకపోవచ్చు. వాళ్లు అనుభవిస్తున్న అమానవీయమైన అణిచివేత, హింస, దోపిడీ నుంచి వాళ్లకు కన్నీళ్లు కార్చే సమయమూ, అవకాశమూ ఉండకపోవచ్చు. దోపిడీ సమాజం ఆ ప్రజల దేహాలను, మనసులను పిండి పిప్పి చేస్తుంటే వాళ్ల నెత్తురు చెమటయి కారడమో, చిత్రహింసలతో నెత్తురై కారడమో తప్ప ఎండిపోయిన కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారే అవకాశం లేకపోవచ్చు. గొంతులో తడి మిగిలితే కదా గాద్గదికంగా దుఃఖించడానికి. కానీ ఇవ్వాల్టి సమస్య కాదు. స్పార్టకస్‍ కాలానికి పీడితులైన, దోపిడీకి గురైన బానిసలకు మొదటిసారి తాము బానిసలుగా చూడబడుతున్న మనుషులమని తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం కన్నా
ఓపన్ పేజ్

ఈ  ‘తెలుగుదనం’  దేనికి?

కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్‌ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే  తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి   పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల