మొక్కవోని మార్క్సిస్టు నిబద్ధత
ఇటీవల విడుదలైన ఇక్బాల్ కవితా సంపుటి *కళ చెదరని స్వప్నం* కు రాసిన ముందుమాట దేశ భక్తంటే రాజ్యభక్తిగాదోయ్ దేశ ప్రేమంటే ప్రజపట్ల ప్రేమోయ్ దేశ రక్షణంటే వనరుల రక్షణే చేను మేసే కంచెల్ని కాలబెట్టు మార్క్సిస్టు కవులకు చరిత్ర పట్ల, వర్తమానం పట్ల విమర్శనాత్మక దృష్టి ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఆశావహ దృష్టి ఉంటుంది. మార్క్సిస్టు కవులు ప్రాదేశికత నుండి విశ్వజనీనత వైపు లేదా అంతర్జాతీయత వైపు పయనిస్తారు. మార్క్సిస్టు కవులది భౌతికవాద ప్రాంపచిక దృక్పథం. మనిషిని, మనిషి శ్రమను సత్యంగా గుర్తిస్తారు. మానవేతర శక్తులను తిరస్కరిస్తారు. మార్క్సిస్టు పాలకులు భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను, ఆ వ్యవస్థల