ఒళ్లు గగుర్పొడిచే నవల’వేట’
ప్రపంచ సాహిత్యంలో వేటది ప్రత్యేకస్థానం. ప్రఖ్యాతి పొందిన 'ఓల్డ్ మాన్ అండ్ ది సీ ' నవలా రచయిత ఎర్నేస్ట్ హెమింగ్వే స్వయంగా సాహసి, పెద్ద జంతువుల వేటగాడు. ఆయన మరో రచన 'గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’ ది వేట సాహిత్యంలో మొదటి స్థానమని చెబుతారు. విల్సన్ రాల్స్ 'వేర్ ది రెడ్ ఫెర్న్ గ్రోస్' పిల్లల కోణంలో రాసిన వేట నవల. జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ది వైల్డ్’ నవల, ‘ది సీ వుల్ఫ్’ కథలు మన తెలుగు పాఠకులకు బాగా పరిచయం అయినవి. ప్రమాదకరంగా మారిన హిమాలయ చిరుతల, పులుల వేట










