గల్పిక కథలు

ఆర్టికల్ 19 vs జీవో 73

“పదహారు ప్రజా సంఘాలను యెందుకు నిషేధించారు?” “మొదటిది... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను యెత్తి చూపుతున్నాయి...” “ఔను, ప్రజాస్వామ్యంలో యెవరు పడితే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పే” “అంటే విమర్శించి రెచ్చగొట్టి తమ సంఘాల వైపు ఆకర్షిస్తున్నాయి...” “నిజమే, ప్రభుత్వాలు ఆకర్షణ శక్తిని కోల్పోయినట్టవదూ?, యింకా నేరం” “రెండోది... అన్నల ఆదేశంతో బీడు భూములు ఆక్రమించేసుకుంటున్నారు...” “ఔన్లే, లీడర్స్ ఆక్యుపై చెయ్యొచ్చు... బడా బడా కంపెనీలకు వేల ఎకరాలు అప్పనంగా రాసివ్వొచ్చు కానీ బీదా బిక్కీ బీడు భూములు దున్నుకోవడం తప్పే” “అంతేకాదు, రాజ్య నిర్బంధం మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు” “ఊ... నిరసన కార్యక్రమాలకు అవకాశం
సాహిత్యం కవిత్వం

ఏది ప్రజాస్వామ్యం

శవాలపైన భవంతులు కట్టిబంగారు పళ్ళెంలోపంచభక్ష్య పరమాన్నాలు తినేదొరలుగల్ల దేశంలోఏది ప్రజాస్వామ్యం రెడ్ కార్పెట్ వేసికుక్కల్ని పిలిచితల్లి దేహాన్నిముక్కలుగ నరికివిందునేర్పరిచేగుంట నక్కలున్నఈ రామ రాజ్యంలోఏది ప్రజాస్వామ్యం సైన్సును సాగిలబడేసినాన్ సైన్స్నునాన్సెన్స్లచేతుల బెట్టిననపుంసకులెలేఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం ప్రశ్నించేప్రజాస్వామ్యంఅని చెప్పిఉపా చట్టాలు బెట్టిఅండా సెల్లులోజీవితాలనుఅంధకారంచేస్తున్న ఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం మూడత్వంమురుగు నీటిలోదైవత్వందయా దక్షిన్యాలతోఉపొంగుతూ ప్రవహిస్తున్నశవాల కాల్వలున్నఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం
సాహిత్యం కవిత్వం

అక్షరాల పై నిషేధం

ఆకలి ఆక్రందనలుఅత్యాచారలు  అన్యాయపుకారు చీకట్లను చీల్చె అక్షరాలపై నిషేధమా..?అంటరాని పూరి గూడిసేలనెగడయి నిటారుగ నిలబడికందిలయి దీపమయినందుఅక్షరాలపై నిషేధమా..?నొసటి మీద చమట నేల చిందనిదేచదును కాని హలంసేద్యపు గింజల రాశులు పోసిన చొటకర్షకులు కాయకష్టంబయిన అక్షరాలపై నిషేధమా..?అణిచివేతలపై తిరుగుబావుట జెండాయైప్రజల గొంతుకల పోరు పాటలయిప్రతిధ్వనించిన నేలలో అక్షరాలపై నిషేధమా..?అసమానతల కంఠాన్ని తెగనరికితెలంగాణ ఉద్యమ రాగాన్ని పల్లవించియెల్లలు లేని ప్రపంచానికి చాటినఅక్షరాల మీద నిషేధమా..?ఆర్థిక రాజకీయ కోణాన్ని విడమర్చి చాటిహక్కులకై సల్పిన పోరులో నెగడయి మండుతున్నఅక్షరాలపై నిషేధమా..?అవునుఈఅక్షరాలు ఇప్పుడు నిషేధమెఅప్పుడు నిషేధమెరాజ్యాన్ని ప్రశించినందుకురాజ్యపు  నిషేధాలా కొలిమిలొంచికాగడాలయి అక్షరాల మంటలనుదావనంలా వ్యాపిస్తాయి... (విరసం పై నిషేధాన్ని ఖండిస్తూ....)
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
సాహిత్యం కథలు

సుబ్రమణ్యం కంట తడి

ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌
సాహిత్యం సమీక్షలు

కార్మికుల సామూహిక చైతన్యమే “స్ట్రైక్” సినిమా సారాంశం

“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.    1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”.  ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం! దీని నిడివి
సాహిత్యం కవిత్వం

వసంతం

చిన్నబోయినా కనుల కన్నీటిని తుడిసిన వేళ నిండు పున్నమి నదిపై పరుసుకున్న వేళ ఎర్రని మేఘంపైఎగిరే పక్షిని నేనై రాగం పాడే వేళ రంగస్థలములో నేను ప్రేమ రంగులద్దిన వేళ రానే వచ్చింది వసంతం ప్రేమను పేర్చింది వసంతం రానే వచ్చింది వసంతం స్వేచ్ఛను తెచ్చింది వసంతం
సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను