సాహిత్యం అంతర్జాతీయ చిత్ర సమీక్ష

చివరి ఆరు రోజులు!

1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ  “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”.  ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు. ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్  దృష్టి
సాహిత్యం కథలు

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
సాహిత్యం వ్యాసాలు

ప్రతి విపత్తూ పెట్టుబడికి వరమే

ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య,  వారి సంపదను లెక్కించడం లో    ఫోర్బ్స్ సంస్థ  అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో,  వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక  దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్  నివేదికను
సాహిత్యం కవిత్వం

ఇక్కడి నీడలు నీడల్లా వుండవు

మా దేహపు నీడలోనూమా ఊపిరిపాట వినిపిస్తుంది మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణమా కడుపులోకి ఎలా దూకిందోమా దేహపు నీడలోనూ కనిపిస్తుంది స్థూపాల నీడలన్నీ కలగలిసినేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయిమా దేహపు నీడలోనూఅదే త్యాగాల రంగు దట్టమైన చీకటిలోనూనిద్ర పట్టని రాత్రిలోనూనేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయిమా నీడలు మా కింద నుండి పారుతుంటాయిగుండెలు పగిలిఅచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్నమరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికిమా నీడలు పారటం నేర్చుకున్నాయి చిమ్మ చీకటిలోనూమా నీడలన్నీ సజీవమేనీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలుపిడికిళ్లుగా మారుతుంటాయిపిడికిళ్లుగా పాడుతుంటాయి ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండిఇక్కడి
సాహిత్యం కవిత్వం

పరాకాష్ట

చేతులకు సంకెళ్ళువేసినరాతను గీతనుఆపలేవుకాల్లకు సంకెళ్ళువేసినమా ఆటను అడ్డుకోలేవునోటికి సంకెళ్ళువేసినపాటను మాటనుప్రశ్నను ఆపలేవుఅక్షరం పై ఆంక్షలుశబ్ధం పై నిషేదంకదిలిక పై నిర్భందంమెదలిక పై నిఘాఅప్రకటిత చీకటిపాలనకు పరాకాష్టఇక మౌనం మండాల్సిందేశబ్ధం విస్ఫోటం చెందాల్సిందే
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
సాహిత్యం వ్యాసాలు

నిషేధాన్ని ఇలా చూద్దాం!

నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు,
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌లో జేసీ

*క్లాసిక‌ల్* సంవిధానంలోని వెలుగు నీడ‌లు విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని  1980ల  త‌రంలో  జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆ ద‌శాబ్దంలోనే ఆయన ప్ర‌ధాన  రచనలు   వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది. విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో  కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు.  వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు.  ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా
సాహిత్యం కథలు

బేన్

అల్పిక “టియ్యారెస్‌ని బేన్ చేస్తారా?” “ఏమ్మాట్లాడుతున్నావ్?” “అంటే పదహారు ప్రజాసంఘాలనీ బేన్ చేసారు కదా?” “ఔను... అయితే?” “అంటే తెలంగాణ సాధనకోసం వాటితో కలసి టియ్యారెస్ పనిచేసింది కదా?” “అవంటే ఉద్యమ సంఘాలు” “మరి టియ్యారెస్ ఉద్యమ పార్టీ కదా?” “.....................?!?.....................”
సాహిత్యం కవిత్వం

లైబైసన్

అదొక ఓక్ చెట్టుశాఖోపశాఖలుగా విస్తరించిఊడలు దిగి రారాజుగావిర్రవీగుతుంది చిన్న చిన్న మొక్కలనుఎదగనీయదుఎదుగుతున్న మొక్కల చిదుము అచ్చట రెండు పూల మొక్కలురెండూ చేదోడు వాదోడుగారాబిన్ జారవిడచిన సైక్లామెన్ గింజలతో మొక్కలెదిగినా వాసన వ్యాప్తి లేదునేల మొక్క కాదది వలస మొక్క అదిఫుక్క్వా మొక్కల కంటే తక్కువేేదీన్ని పుట్టుక ఇక్కడే మరణమూ ఇక్కడేతన జాతి బీజాలు పదిలం ఈ నేలలో ఐనా సైక్లామెన్ సాగు కి ఎక్కువ చోటుఫుక్క్వా సాగుకి తక్కువ చోటుఓక్ చలువేతన నేలలో తానే పరాయై అస్తిత్వంకోసంభూపొరల్లో తండ్లాట ఓక్ఒక దాన్ని చంపి మరొక దాన్ని బతికించే యత్నం సైక్లామెన్ ని మచ్చిక చేసుకునిఫుక్క్వా సువాసనను కట్టడి చేేయనిరంతర