శాకమూరి రవి

నాకు

రాయిని చూపి 

రాముడని నమ్మించి 

రాజ్యాలేలే చోట 

నేను

రాయిని ‘రాయని’నిజం మాట్లాడితే 

వాని మనోభావాలు  

దెబ్బతినవా మరి  

నాకు

మనుధర్మమే 

ధర్మమని నమ్మించి

మనుషుల మధ్య  

మంటల్ని సృష్టించి 

రాజ్యాలేలే చోట 

నేను

మనుధర్మం గుట్టువిప్పితే 

వాని మనోభావాలు

దెబ్బతివా మరి 

నాకు 

అశాస్త్రీయాన్ని 

శాస్త్రీయమని  నమ్మించి

నా అణువణువునా 

కర్మసిద్ధాంతాన్ని కరింగించి

అందమైన రాజ్యభవనంలో 

కునుకుతున్న మనువుకు 

నేేను

శాస్త్రీయ గీతాలను అందుకుంటే  

వాని మనోభావాలు 

దెబ్బతినవా మరి.  

Leave a Reply