సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి