సమీక్షలు

కష్టమైన జర్నీ

ఇటీవల విడుదలైన శ్రీరామ్ పుప్పాల దీర్ఘ కవిత 1818కు రాసిన ముందుమాట ఈ మధ్య కాలంలో అంతా బాగానే ఉంది. 'హక్కులు మనవి, హక్కుల పోరాటం వాళ్ళది' అని వాటాలు వేసుకున్నాక కులాసాగానే గడుస్తోంది. మీకు తెలియంది కాదు. 'వర్తమానం' ఎప్పుడో బహువచనంలోకి మారిపోయింది. ఇప్పుడు అనేక వర్తమానాలు. నచ్చిన, కంఫర్టబుల్ వర్తమానాన్ని ఎంచుకుంటున్నాం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టని 'నైసిటీస్'ని మాట్లాడటం, రాయడం, చదవడం అలవాటు చేసుకున్నాం. నచ్చిన రంగు సన్ గ్లాసెస్ లో వెలుగును చూస్తూ, 'ఎవ్రీధింగ్ లుక్స్ ఫైన్' అని 'ఉబర్ కూల్ పోజ్'ల ఆత్రం లో ఉన్నాం. అంతా బాగానే ఉంది. సౌకర్యంగానే
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల