చాలా  సముచితమనిపించే పదాలు మరియు పదబంధాలను శక్తిమంతులు తెలివిగా ఉపయోగించడంలో, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని చూడవచ్చు.

ది హత్రాస్ దారుణం, జాతీయ మనస్సాక్షిపై  లేదా దానిలో యింకా ఏదైనా  మిగిలివుంటే  దానిపై బలమైన ముద్ర  వేసింది. సాంఘిక అణచివేతపు అత్యంత క్రూరమైన పార్శ్వాన్ని ప్రజలకు చూపింది.అంతేకాకుండా,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నిసిగ్గుగా మరియు నిస్సంకోచంగా అణచివేతదారులకు మద్దఇవ్వడానికి ఉపయోగించడాన్ని ప్రజలు చూశారు. యుక్తవయసులో ఉన్న దళిత బాలికపై అమానుషంగా దాడిచేసి –(  ఆమెను భారతి అని పిలుద్దాం) – చివరికి  చంపడమేగాక, ప్రథమ సమాచార నివేదికనివ్వడంలో కూడా తటపటాయించారు .అంతేగాక, నిర్దయతో  వైద్యపరీక్షను ఆలస్యంజేసారు, మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంతేగాక, అత్యంత క్రూరంగా, హత్యచేయబడ మహిళ కుటుంబ సభ్యుల  లేకుండా పోలీసులు మృతదేహాన్ని దహనం చేసారూ.. ఇవన్నీరాజ్యంగా యంత్రాన్ని నిస్సిగ్గుగా తమకనుకూలంగా వినియోగించుకోవడం గాక, మరేమవుతుంది.

సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడమనేది  రాజకీయ దౌర్జన్యంతో జరిగింది:కుటుంబ సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు, గ్రామం మొత్తాన్ని భారీ పోలీసు బలగాలతో బారికేడ్లతో నిర్భందించారు. .బాధిత కుటుంబం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను, మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ఇవన్నీ మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నియంతృత్వ పోకడల  భయంకరమైన ఉదాహరణలు.

ప్రసంగాల  తయారీ అయితే, నేను పైటిలో దేనిపైనా దృష్టి సారించడం లేదు..పై  భయంకరమైన సంఘటన పై  ప్రసంగాన్ని రూపొందించడానికి   అధికార పార్టీ యొక్క అధికార ప్రతినిధులు ప్రయత్నించినప్పుడు వారినుండి జాలువారే ప్రసంగాల గురించి మాట్లాడుతాను.వినేవారిని మోసం చేయడానికి, తప్పుడు వాదనలను ఉపయోగించడం వితండవాదపు సాధారణ రూపం. కానీ, ఇక్కడ వినిపించేది అత్యవసరమైన, సంబంధిత సత్యాలను దాచడానికి వాస్తవ ప్రకటనలను ఉపయోగించడం. ఇది సాధారణ అబద్ధపు లేదా తప్పుడు సమాచారం కాదు. కానీ, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో తగిన పదాలు, పదబంధాలను తెలివిగా ఉపయోగించడం. తప్పుడు ప్రసంగాన్ని రూపొందించడానికి వాస్తవాలు మరియు సత్యాలు ఎలా ఉపయోగించబడతాయి అనేదానికి వారి  వాదనలలో కొన్ని మంచి ఉదాహరణలను చూడవచ్చు.

నేను నా అభిప్రాయాన్ని మూడు ఉదాహరణలతో వివరిస్తాను.

 ముందుగా తప్పుడు వివరణ సమస్యను చూద్దాం. ఓ టెలివిజన్ ఛానెల్‌లో అధికార పార్టీప్రతినిధి ఒకరు ‘యువతి మృతితో బాధపడ్డాను’ అని చెప్పడం విన్నాను. పైకి చూడడానికి ఆ వ్యక్తీకరణ   సున్నితంగానూ మరియు సముచితంగానూ అనిపిస్తుంది; భారతి చనిపోయాక అది సమంజసంగానూ, ప్రాణనష్టం గురించి వ్యక్తీకరించిన ఆవేదనగానూ  అనిపిస్తుంది. కానీ, అది ఆమెను నిర్దాక్షిణ్యంగా, దారుణంగా అత్యాచారానికి గురిజేసి,  పొడిచేసిణ తర్వాత చివరికి చంపబడిందనే తిరుగులేని  నిజాన్ని దాస్తుంది. కాబట్టి, ‘చనిపోయింది’ అనే పదం ఈ సందర్భంలో  పూర్తిగా సరైనదికాదు. భిన్న కారణాలు, ప్రమాదం, ఆత్మహత్య లేదా హత్య ద్వారా ఒక వ్యక్తి మరణo సంభవిస్తే-వాటి మధ్య భేదాలను    గుర్తించడానికి ‘మరణం’ అనే పదం సరిపోదు.

ఒక వ్యక్తి’ హత్య’కు గురైనప్పుడు ఆమె’ మరణం’ గురించి మాట్లాడటం  తప్పుదారి పట్టించడమే. ఆవ్యక్తీకరణను   అదేపనిగా, ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తే అది క్షమించరాని కుతంత్రం తప్ప మరొకటి కాదు. ఇది సత్యాన్ని మరుగుపరుస్తుంది. అదేవిధంగా, క్రూరమైన హత్యగురించి తెలిసినపుడు కేవలం విచారాన్ని వ్యక్తంజేయడం  మాత్రమే తగిన భావోద్వేగం కాదు.దానిపట్ల  కోపం, భయాందోళన లేదా ఆగ్రహాన్ని కలిగి ఉండకపోవడం మన భావోద్వేగ మరియు నైతిక వైకల్యాన్ని సూచిస్తుంది. మొత్తంమీద, భారతి దారుణ హత్యగురించి కేవలం  బాధను వ్యక్తపరచడం అనేది  తప్పుడు వివరణేగాక ,ఆ వ్యక్తీకరణ  ఆ సందర్భానికి తగిన  భావోద్వేగం కాదు. వారంతా కలిసి ఆ దారుణ ఘటనలోని నిజాన్ని దాచిపెట్టారు. మానవ సంభంద విషయాలలో సంభవించినఘటన యొక్క సరైన, అత్యంత సరైన వివరణ ఇవ్వడమనేది తరచుగా సత్యం,  అబద్ధం మధ్యగల  వ్యత్యాసాన్ని బహిర్గతం జేస్తుంది. అసందర్భ వివరణలు తప్పులు చేసే శక్తివంతమoతులకు, అలాంటి సంఘటనలలో బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఇటువంటి తప్పుదు వివరణలు మాత్రమే మార్గం కాదు. చాలా తరచుగా, మరోవిధంగా వాస్తవoలో మరోవిధంగా సరైనవి లేదా నిజమైన వివరణలు కూడా  నష్టపరుస్తాయి. కాబట్టి, పురుషుల ప్రవృత్తిలోని దూకుడు, హింస,నియంత్రిచే స్వభావాన్ని  ప్రస్తావిస్తూ భారతిపై జరిగిన అమానుష  దాడికి వివరణ ఇవ్వడమేమటి ఏమిటి?

 కింది ఉదాహరణను చూద్దాం.

 దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి కాలిపోయిన ఇంట్లోకి ప్రవేశించి, కిరోసిన్ డబ్బా మరియు ఉపయోగించిన అగ్గిపుల్లని కనుగొన్నాడు. అతను బయటకు వెళ్ళేటప్పుడు, ఒక విలేఖరి ఇంటికి ఎలా మంటలు అంటుకున్నాయని అడిగాడు. అధికారి “అక్కడ ఆక్సిజన్ ఉన్నందున” అని సమాధానమిస్తాడు. ఇప్పుడు, ఆయన మాటలు అవాస్తవం కాదు, ఆక్సిజన్ లేకుండా ఏదీ మండదు. అయితే, ఆ అధికారి ప్రతిస్పందన పూర్తిగా అసంబద్ధం . అధికారి సమాధానం తప్పు, ఎందుకంటే సరైన  వివరణ కేవలం వాస్తవికంగా సరైనదిగా  ఉండటమే  కాదు, సంభందిత సంఘటనకు సంభందించిన  ప్రశ్నకు సరైన జవాబుగా వుండాలి.

నిశ్చయంగా, రిపోర్టర్ యొక్క మనసులో, ఇల్లు ప్రమాదవశత్తా లేక ఉద్దేశపూర్వకంగా కాలిపోయిందా అనే సందేహం కలిగి వుంటుంది.  రెండోది అయితే, ఖచ్చితంగా ఎవరు మరియు ఎందుకు కారణమయ్యారనే ప్రశ్న తలెత్తుతుంది. నేరపూరిత చర్యకు ఉద్దేశ్యాన్ని కనుగొనడం మరియు బాధ్యులను గుర్తించడం చాలా ముఖ్యం. అదేవిధంగా, మగవారు స్వభావరీత్యా ఆడవారిపట్ల  దూకుడుకు వుంటారనేది  నిజమె కావొచ్చు. అయినప్పటికీ, ప్రాణవాయువు వలె,  ఆ స్వభావం , అత్యాచారం మరియు హత్యల నిర్దిష్ట చర్యలకు  దారితీసే పరిస్థితులలో ఒక అంశం మాత్రమె. హత్రాస్ వంటి వాస్తవ హింసకు సంబంధించిన చాలా సందర్భాలలో ఇది వివరణాత్మకంగా సంబంధితంగా ఉండదు. భారతిపై ఎందుకు దాడి జరిగింది అనేదానికి ప్రేరేపించే కారణాలను కనుగొనడం మన ఆసక్తి అయితే, మనం స్థానిక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, బహుశా రాజకీయ అంశాలను గుర్తించాలి. అందుకు  బదులుగా, అసంబద్ధమైన మరియు సాధారణ ప్రకటనలను చేయడం అనేది సత్యాన్ని దాచడానికి, సాధ్యమయితే నేరాన్ని కప్పిపుచ్చడానికి సూటిగా చేసే ఎత్తుగడ. అదేవిధంగా,హత్యాచారం జరిగిన వెంటనే,ఆ సంఘటన గురించిన చర్చను ,ఇతర ప్రాంతాలలో జరుగుతున్నహత్యాచారాలతో పోలుస్తూ ఆ సంఘటనను నీరుకార్చేoదుకు సాదారణీకరించడం, హాత్రాస్ హత్యాచారసంఘటణ నుండి  మనదృష్టి మళ్లించడమే గాక,హత్యాచార నిందుతులను శిక్షనుండి తప్పించే ప్రయత్నమనవచ్చు. 

బాధితుడి గుర్తింపు ఇది నన్ను మూడవ అంశానికి తీసుకువస్తుంది, ఇది ఎంత స్పష్టంగా ఉందoటే,నేను దీన్ని గురించి రాయాల్సిన అవసరం ఉందనుకోవడంలేదు. భారతిపై దాడి చేసి హత్య చేశారని చెప్పడంతో, దాన్ని ఆపడం అనేది  నిజంతో పొదుపుగానూ, నైతికంగా దుర్మార్గంగానూ ఉండటంలాంటిది. సంఘటనయోక్క  వివరాలను విస్మరించడం అనేది ఆ సంఘటనయొక్క అత్యంత కీలకమైన లక్షణాన్ని మరుగుపరుస్తూంది. ఆ వివరాలకు  పొకుండా ఏమి జరిగిందో అర్థం చేసుకోవడం, వివరించడం సాధ్యం కాదు. అన్ని అత్యాచారాలు  భయంకరమైనవే,అమానుషమైనవే. కానీ ఇది కొంతమంది పురుషులు మహిళలపట్ల క్రూరంగా ప్రవర్తించడం మాత్రమె కాదు, ఒక దళితుణ్ణి ‘అగ్రవర్ణ’ పురుషులు లైంగికంగా వేధించి చంపoడం. భారతికి దళిత గుర్తింపు లేకుంటే ఈ నేరం జరిగేది కాదు. నిజానికి, ఆమె దళితురాలైనందున మాత్రమే కాకుండా, గతంలో ఆమె కుటుంబం ‘అగ్రవర్ణ’ ఆధిపత్యాన్ని ప్రతిఘటించినందువల్లనే సామూహిక అత్యాచారానికి మరియు హత్యాకాండకు గురైంది. భారతి కూడా, చిత్రవధకు గురవుతున్నా, మౌనంగా ఉండలేదు. ఆమె తన మరణ వాంగ్మూలం లో తనపై అత్యాచారాన్ని జరిపిన వ్యక్తుల పేర్లను తెల్పింది.

కాబట్టి, ఒక యువతిపై దుర్మార్గులైన వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని చెప్పడం అబద్ధం కాదు, కానీ భారతి యొక్క దళితత్వాన్ని విస్మరించడం, నేరం యొక్క కుల సంబంధిత స్వభావాన్ని దాచడం అనేది  ఏమి జరిగిందో వివరించడంలో విఫలమవడమెగాక,  తప్పుడు చెప్పాడమే అవుతుంది. కులం,  లింగం, పరస్పర సహగుర్తింపు మాత్రమె  హత్రాస్‌లో భారతికి ఏమి జరిగిందో నిజంగా వివరిస్తుంది., వాస్తవంలో  సాధారణ ప్రకటన తప్పుడుగా  లేనప్పటికీ, పై వాస్తవాలను (భారతి దళిత మహిళ కావడం, ఆకుటుంబంఅగ్రవర్ణ ఆధిపత్యాని ప్రశ్నించడం)  విస్మరించడం లేదా దాచడం వలన సంఘటన గురించిన వివరణ  తప్పు అవుతుంది.

 ఒక స్త్రీని వ్యక్తిగత ద్వేషంతో, ఆమె చేసిన పనికి చంపడం, అమానుషమైన పురుష శక్తిని చాటుకోవడానికి ఆమెను చంపడం మరియు   ఆమె దళితగుర్తింపు కారణంగా మాత్రమే ఆ హత్య చేయబడడం అనే భయంకరమైన చర్యల మధ్య వ్యత్యాసాన్ని మనం కాదనలేము. కుల వివక్షత గల  సమాజంలో, కొన్ని సమూహాలు వారి కులాల చట్రంలో ఖైదు చేయబడుతున్నాయి, కేవలం వారు జన్మించిన కులం కారణంగా మరియు వారు కుల సోపానక్రమంలో దిగువ శ్రేణిలో  ఉన్నందున భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు.

హితవచనాల అసమర్థత(The Inadequacies of Homilies) సాధారణంగా మన మతపరమైన గుర్తింపు సమస్యలు కూడా అలాగే వున్నాయి. అందుకే భారతదేశం అంతటా దళితులపై లేదా ముస్లింలపై లేదా కాశ్మీరీ పండిట్‌లపై  లక్ష్యంగా దాడులు చేయడం వారి గుర్తిoపువల్లనే జరుగుతున్నాయి.  వాటిని ‘అన్ని హత్యలు భయంకరమైనవి’ లేదా ‘అన్ని అత్యాచారాలు భయంకరమైనవి’ వంటివని సాధారణ ప్రసంగాలచే ఖండించలేము. ‘. ఈ నిజమైన, సాధారణీకరించిన ప్రకటనలు కొంతమంది వ్యక్తులు చంపబడిన కారణాన్ని తుడిచివేస్తాయి.వ్యక్తులని, వారి రంగు, లింగం, మతం లేదా జాతీయత కారణంగా ద్వేషించడం , వివక్షత చూపడం మరియు దాడులకు లక్ష్యంగా చేసుకోవడం అంటే ఇతర భయంకరమైన చర్యలకు భిన్నంగా గుణాత్మకంగా నేరం చేయడమె అవుతుంది.ఒక్క వ్యక్తిని మాత్రమే కాకుండా అతని లేక ఆమె మొత్తం సమాజoపై దాడి చేయడమే, మరియు భయపెట్టడమే ఆవుతుంది. ఈ నిర్దిష్ట సమూహ గుర్తింపులకు సంబంధించిన ఏదైనా ప్రస్తావనను వదిలివేయడం అంటే నేరాన్ని పూర్తిగా తప్పుగా వివరించడం, దాని అసలు కారణాన్ని అస్పష్టం చేయడం గాక మరేమీ అవుతుంది.

సంక్షిప్తంగా, కులం మరియు లింగ అణచివేత లోతుగా పెనవేసుకున్న హత్రాస్ హత్యాచారం వంటి సందర్భాల్లో,ఆ హింసాత్మక చర్యలో కులం యొక్క కారణ పాత్రను ప్రజలు చూడకుండా  లింగ వివక్ష్టతను అర్థం చేసుకోలేం. ఒకదానిపై దృష్టి పెట్టకుండా, మరొకదానిపై దృష్టి పెట్టడం కూడా సంఘటనను వక్రీకరించడమే అవుతుoడి. ఈ రాజకీయ ప్రేరేపిత కుతంత్రం ప్రమాదకరం. నేరాన్ని చట్టబద్ధం చేయడం ద్వారా, అలాంటి నేరాలు మరిన్ని జరగడానికి దోహదపడుతుంది.

(అక్టోబర్ 08, 2020 12న “ ది హిందూ”లో అచ్చయిన Using Facts to hide Underlying Truths  కు అనువాదం ) రాజీవ్ భార్గవ గౌరవ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS), ఢిల్లీ

Leave a Reply