ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జాతి హంతక బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్-బిజెపి గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం పేరిట ఆదివాసీ ప్రజలపై యుద్ధాన్ని, మారణహోమాన్ని ఉధృతం చేసింది.

మైనింగ్ కార్పొరేట్ యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి, విప్లవ ప్రజానీకం నేతృత్వంలో భూమి, నీరు, అడవి సంరక్షణ కోసం జరుగుతున్న పోరాటాన్ని నిర్మూలించడానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గ్రామాల్లో ఈ సంవత్సరం ప్రారంభం నుండి, ఐజి సుందర్‌రాజ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ బలగాలను, కిరాయి మిలీషియాలను మోహరించింది. సంవత్సరం ప్రారంభం నుండి వారు 30 మంది కంటే ఎక్కువ గ్రామస్తులను చంపారు.

2024 ఏప్రిల్ 2 నాడు రేపిస్టులు, యుద్ధ నేరస్థులైన సి‌ఆర్‌పి‌ఎఫ్ అధికారులు “మావోయిస్ట్ ప్రభావిత గ్రామంలో” 8-9 గంటలపాటు జరిగిన భీకర కాల్పుల్లో 13 మంది మావోయిస్టులను అంతమొందించామని, తమలో ఎవరూ గాయపడలేదని గొప్ప ఉత్సాహంతో ప్రకటించారు.

 బస్తర్‌లోని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త బేలా భాటియా మావోయిస్ట్ అణచివేత ప్రచారోద్యమంలో రాజ్య హంతక శక్తుల “విజయాన్ని” బహిర్గతం చేసారు. ఆమె తన నిజనిర్ధారణ నివేదికను మీడియాకు అందించారు. రోగలక్షణ అబద్ధాలకోరు పి సుందర్‌రాజ్‌తో సహా సిఆర్‌పిఎఫ్ అధికారులు 13 మంది ఘోరమైన మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారనే బూటకపు కథ పూర్తిగా అబద్ధమని స్పష్టంగా పేర్కొన్నారు.

 ఆ 13 మందిలో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే సిఆర్ పిఎఫ్, మిలిషియా దళాలతో కాల్పుల్లో పాల్గొన్నారని ఆమె చెప్పారు. మరో ఐదుగురు నిరాయుధ మావోయిస్టు రాజకీయ కార్యకర్తలను గ్రామం నుంచి తీసుకెళ్లి గ్రామస్తుల కళ్ళెదుటే  కాల్చి చంపారు. ఒక మహిళా రాజకీయ కార్యకర్తను కాల్చి చంపడానికి ముందు మొదట బట్టలు విప్పి లైంగికంగా వేధించారని గ్రామస్థులు తెలిపారు. అలాగే, నెంద్ర గ్రామానికి చెందిన ఒక ఆదివాసీ మైనర్ బాలికను ఆమె ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసి, నరకయాతన పెట్టిన సిఆర్‌పిఎఫ్‌, గ్రేహౌండ్స్ సిబ్బంది కాల్చి చంపారు.. వారు మొత్తం ఐదుగురు గ్రామస్తులను చంపి, వారిని మావోయిస్టులు అని చెప్పారు.

భారతదేశం లోని “అతి గొప్ప ప్రజాస్వామ్య” దేశానికి అధ్యక్షురాలు ఒక ఆదివాసీ మహిళ, ప్రస్తుత ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి కూడా ఒక ఆదివాసీ, కానీ వారు ఆదివాసీల అమలవుతున్న క్రూరమైన, అమానవీయ హింస, అత్యాచారం, మారణహోమంపై మౌనంగా ఉండటమే కాదు,, వారి నాయకత్వంలో నేడు ఆదివాసీలు వారి నీరు, అడవి, భూమి, భూమి, గౌరవాన్ని దోచుకుంటున్నారు.

ఆదివాసీల భూములను బడా స్వదేశీ, విదేశీ మైనింగ్ కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ నేడు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ కగార్ పేరుతో మరింత క్రూరంగా, దూకుడుగా, హత్యారూపం దాల్చింది.

సల్వాజుడుంను రద్దుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు, సల్వాజుడుం లోని అత్యాచారులు, హంతకులకి పరిపాలనాపరమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా రాష్ట్రం ఎస్‌పి‌ఓ, డి‌ఆర్‌జి, బస్తర్ ఫైటర్లను సృష్టించింది. అర్ధ భూస్వామ్య, అర్ధ వలస భారత రాజ్యంలో, దాని సామ్రాజ్యవాద పెత్తందార్ల పాలనలో ఎన్నికల ద్వారా ఎన్ని మార్పులు వచ్చినా, దోపిడీ, పాలన, ప్రజా దోపిడిలో మౌలికమైన మార్పు రాలేదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

విప్లవ విద్యార్థుల ఫ్రంట్ తరపున మేము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌తో సహా భారతదేశంలోని వివిధ ఆదివాసీ ప్రాంతాలలో విప్లవకారుల నేతృత్వంలో సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక పోరాటంపై యుద్ధ నేరస్థులు బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిపై అత్యాచారాలు, హత్యలతో సహా ఈ అమానవీయ, అప్రజాస్వామిక సైనిక దాడికి నిరసన తెలియచేయాలని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక, వామపక్ష శక్తులు, వ్యక్తులకు పిలుపునిస్తున్నాము.

Leave a Reply