ఏ రాజకీయ పార్టీ (కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజెపి) అధికారంలో ఉన్నా వర్గ పోరాటానికి సంబంధించి సామ్రాజ్యవాద ` భూస్వామ్య (అర్ధ వలస ` అర్ధ భూస్వామ్య) దళారీ రాజ్యానికి విప్లవోద్యమం పట్ల ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ఆయా సందర్భాలకు ఎత్తుగడలు ఉంటాయి. 2004లో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మావోయిస్ట్టు పార్టీ ప్రతిపాదించిన ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి చర్చలకు పిలిచింది కానీ పీపుల్స్‌వార్‌తో చేసిన చర్చల ప్రతిపాదనను అది ఎం.సి.సి. వంటి మరో సాయుధ విప్లవ పార్టీతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి చర్చలకు వచ్చిందనే ఎరుక కలగగానే రెండవ విడత చర్చల వాగ్దానాన్ని భంగపరచి 2006 జనవరి నుంచి ఎన్కౌంటర్లు, రాజ్యహింసకు పూనుకొని ఆంధ్రప్రదేశ్‌ను రక్తసిక్త రాష్ట్రం చేసింది. అయినా తిరిగి 2010లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అఖిల భారత స్థాయిలోనే చర్చలకు స్వామి అగ్నివేశ్‌తో చర్చల ప్రతిపాదన చేసి మవోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభివక్త ఆజాద్‌ను, హేమచంద్రపాండే అనే జర్నలిస్టుతో పాటు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చింది. అధికారంలోకి వచ్చేముందు అదే ప్రతిపాదన పశ్చిమబెంగాల్లో చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఆ చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని ప్రతిపాదనతో దండకారణ్యం నుండి రaార్ఖండ్ మీరుగా పశ్చిమబెంగాల్లో ప్రవేశిస్తున్నపుడు ద్రోహి ద్వారా మిడ్నాపూర్‌లో అరెస్టు చేసి ఎన్కౌంటర్ పేరుతో కిషన్‌జీని చంపేసింది.
ఇపుడు ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా చాల ఉధృతంగా చర్చల ప్రతిపాదన చేస్తున్నది. నిజానికి బిజెపి ఒక్కటే అన్ని వేళలా మావోయిస్టు పార్టీతో చర్చల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నది. 2002లో మొదటిసారిగా సిసిసి ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు అంగీకరించినపుడు పీపుల్స్‌వార్ పార్టీ ప్రతినిధులతో చర్చలు జూన్ 5న ప్రారంభమై జూన్ 9న అప్పటి హోం మంత్రి, ఉప ప్రధాన మంత్రి అయిన ఎల్.కె. అద్వానీతో కలిసి బిజెపికి టిడిపికి రాష్ట్రపతి ఎన్నిక, గుజరాత్ హత్యాకాండ విషయంలో అవగాహన కుదరగానే ఆయుధాలు వదిలివేస్తేనే చర్చలు కొనసాగుతాయన్నాడు. జూన్ 20, 2002 తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత ఎన్‌కౌంటర్‌తో తొలి ప్రక్రియ ఆగిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి బఘేల్ కూడ సైనికీకరణను ఒకవైపు పెంచుతూనే మరొకవైపు మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్నాడు. అందుకని మావోయిస్టు పార్టీ స్పందించలేదు. బఘేల్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ విషయంలో కేంద్రానికి ఆకాశ మార్గాన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బీజాపూర్ ప్రాంతంలో తరచుగా బాంబులు వేయడానికి, ఎన్కౌంటర్లకు, సైనికీకరణకు పూర్తిగా సహకరించడమే కాకుండా డిస్ట్రిక్ రిజర్వు గార్డ్స్‌గా గతంలోని సాల్వాజుడుం సాయుధ మాఫియాను పోలీసు శాఖగా ఒక గుర్తింపునిచ్చి ఎన్కౌంటర్లలో ఈ బాంబింగ్‌కు సహకరించాడు. బస్తర్ ఫైటర్స్ అని బస్తర్‌లోని ఏడు జిల్లాల కోసం 2100 మంది ఆదివాసీ యువకులతో రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాన్ని ఈ ఏడు జిల్లాల్లోనూ అదనంగా మావోయిస్టులనెదుర్కొనే ఒక అంతర్యుద్ధ ప్రేరణతో ఎన్కౌంటర్లో ఉపయోగించారు. ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా ఛత్తీస్‌గఢ్ బిజెపి ప్రభుత్వం మొదటిసారి ఎన్నికల ముందు ఒక ఎంఎల్ఏనే ఆదివాసీ గనుక ముఖ్యమంత్రిని చేసింది. అంటే వరుసగా మూడుసార్లు ఆదివాసేతర ముఖ్యమంత్రి రమణసింగ్తో ప్రభుత్వం ఏర్పరచిన బిజెపి మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడానికి సాల్వాజుడుం వంటి చట్ట వ్యతిరేక సాయుధ మాఫియాను ప్రతిపక్ష నాయకుడు మహేంద్రకర్మతో తయారుచేసిందేగానీ అదే బిజెపి ఆదివాసీని ముఖ్యమంత్రిని చేయగానే చర్చల ప్రతిపాదనను చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. పైగా ఇప్పుడిది రమణ్‌సింగ్ రెండవసారి, మూడవసారి ఎన్నికైనప్పటివలెనే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్రంలోను, రాష్ట్రంలోను బిజెపి ఉన్నది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన సందర్భంలో 2024 జనవరిలో కేంద్ర హోం మంత్రి 2024 లోక్‌సభ ఎన్నికలు మాత్రం మావోయిస్టు రహిత భారత్‌లో జరుగుతాయన్నాడు. దానికనుగుణంగా ఎన్నికలతో నిమిత్తం లేకుండానే ఆకాశ యుద్ధాన్ని, ఎన్కౌంటర్లను కొనసాగించాడు. గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్లు ` మావోయిస్టుల పేరుతో గ్రామీణు ప్రజలను చంపడం, చివరకు తల్లి ఒడిలోని ఆరు నెలల పాపను సహితం చంపి క్రాస్ ఫైర్‌లో చనిపోయిందని చెప్పడం చూసాం.
మావోయిస్టు రహిత భారత్‌లో 2024లో ఎన్నికలు జరుగుతాయనే కేంద్ర హోంమంత్రి ప్రకటనకు అనుగుణంగానే ఈ మూడు నెలల్లో 2023 సంవత్సరం మొత్తం జరిగిన ఎన్కౌంటర్లకన్నా ఎక్కువ ఎన్కౌంటర్లు మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మేరకు దంతెవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఇచ్చిన పత్రికా ప్రకటననే చూడవచ్చు. మార్చ్ 18వ తేదీన దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరి మావోయిస్టుల మరణంతో, రాష్ట్రంలో ఈ మూడు నెలల్లో ఎన్కౌంటర్లలో మావోయిస్టు మృతుల సంఖ్య 29కి చేరింది. ఇది గత సంవత్సరం మొత్తం మీద ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల 23 సంఖ్యకన్నా ఇప్పటికే ఎక్కువ అని చాల గర్వంగా చెప్పుకున్నాడాయన. ఈ 29 మంది కూడ బస్తర్‌లోనే మరణించారు. పదముగ్గురు జీజాపూర్లో, సుకుమాలో నలుగురు, దంతెవాడ, కాంకేర్ జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు వీళ్లుకాక పౌరులు 12 మంది, భద్రతా బలగాలు 6 మంది చనిపోయారు. అయితే పోలీసులు చెప్తున్న మావోయిస్టులు అందరూ మావోయిస్టులు కారని వాళ్ల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ముందు శవాలను పెట్టుకొని ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 25న కాంకేర్ జిల్లాలో కోయల్బెడా గ్రామంలో ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు గ్రామస్తులని ప్రజలు ఉద్యమించడంతో మెజిస్ట్ట్రేరియల్ విచారణకు కూడ ఆదేశించారు.
అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రకటన చేసినప్పటి నుంచి గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఎన్నికలు ముగియగానే మావోయిస్టుల గురించిన గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. అప్పటి నుంచి బస్తర్ ప్రాంతంలోని రీజియన్‌లోని ఏడు జిల్లాలు కాంకేర్, కొండగావ్, నారాయణ్‌పూర్, బస్తర్, దంతెవాడ, బీజాపూర్, సుకుమాలో అవే ప్రాథామ్యాలతో కొత్తగా భద్రతా దళాల మోహరింపు పెరిగింది. మావోయిస్టులకు బలమైన పట్టు ఉన్న కేంద్రాలు అనుకుంటున్న గ్రామాలను దృష్టిలో పెట్టుకున్న కొత్తగా 24 పోలీసుస్టేషన్లు ఈ మూడు నెలల్లో నెలకొల్పారు. వాటిలో పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ నాయకుడుగా భావించే హిడ్మా గ్రామం పువ్వర్తి లో కూడా ఒకటి. హిడ్మా తర్వాత పిఎల్‌జిఎ ప్రముఖుడుగా భావించే బద్రదేవాది కూడ ఈ గ్రామమే. ‘సాక్షి’ విలేఖరిని ఈ గ్రామానికి తీసుకువెళ్లి హిడ్మా ఇల్లు ఫొటో వేయించి ఆ గ్రామంలో ఎంత భయానక వాతావరణం ఏర్పడి ఉన్నదో ఒక కథనం కూడ రాయించారు. ఒకవైపు ప్రకటన, దానిననుసరించే ఇన్ని చర్యలు చేసి కూడ ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడి మొదటిసారిగా బిజెపి ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఇపుడు ఈ మూడు నెలలుగా గత ఏడాది కన్నా మించిన ఎన్కౌంటర్లు, రాజ్యహింస జరిగిన దృష్టాంతాలు ఇంత స్పష్టంగా గణాంకాలతో పాటు స్పష్టంగా ఉండగా మరిప్పుడు చర్చల ప్రతిపాదన ఎందుకు?
ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే చిటికెలో మావోయిస్టులను నిర్మూలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పి, ఛత్తీస్‌గఢ్ నుంచి వెళిపోయేపుడు రాయ్‌పూర్‌లో 2024 ఎన్నికలు మావోయిస్టు రహిత భారత్‌లో జరుగుతాయని ప్రకటించిన అమిత్ షా కేవలం ఈ ప్రచారంలోనే లేడు. క్షేత్రస్థాయి మావోయిస్టు నిర్మాణం, యుద్ధవ్యూహం ప్రజల్లో మావోయిస్టులకున్న గడ్డివేళ్లస్థాయి బలం అంతా కూడ అంచనా వేశారు. బిజెపి శ్రేణుల నైతికత కోసం, ప్రతిపక్షాలను అదరగొట్టడానికి ఏం చెప్పినా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢల్లీికి వెళ్లాక జనవరి నెలలో భద్రతా దళాలతో, మావోయిస్టు పార్టీతో యుద్ధంలో భాగస్వాములయిన పాలకవర్గాలతో స్టేక్ హోల్డర్స్‌తో ఒక సమీక్ష సమావేశం జరిపి, మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలయినా బస్తర్‌లో మావోయిస్టు ప్రాబల్యాన్ని తగ్గించడం సాధ్యం కాదని సమీక్షలో తేల్చాడు.
‘భద్రతా బలగాలకు స్టేక్ హోల్డర్స్‌కు వామపక్ష తీవ్రవాదాన్నీ ఛత్తీస్‌గఢ్’లో రానున్న మూడు సంవత్సరాల్లో అంతం చేస్తామని హామీపడ్డాడన్నది అధికారిక వార్త.
పైన పేర్కొన్న 29 ఎన్కౌంటర్లయినా, కొత్తగా వచ్చిన పోలీసు స్టేషన్లయినా, భద్రతాదళాల మోహరింపు అయినా మనం ఈ సమీక్ష సమావేశం వ్యూహం వెలుగులోనే చూడాలి.
అంతమాత్రమే కాదు. క్యారట్ స్టిక్ (కందము`కర్ర) పాలసీ `కందం ఆశ చూపి కర్రతో కొట్టాలన్న అతిపాతదయిన విధానంలో భాగంగానే ఇపుడు ఆదివాసీ ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యన నలుగుతున్న ‘ఆదివాసుల సంక్షేమం దృష్ట్యా ఈ చర్చలకు ప్రతిపాదన చేస్తున్నాడనేది స్పష్టమే. అందుకే నిర్దిష్ట కాలానికి ఇరువైపుల కాల్పుల విరమణ, సైనిక బలగాలు బ్యారక్లకు పరిమితం కావడం, ఎన్కౌంటర్లు ఆగిపోవడమనే అనుకూల వాతావరణం ఇంకా స్పష్టతకోసం మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అభివక్త వికల్ప్ మాటల్లోనే చెప్పాలంటే:
‘‘కానీ ఈ అనుకూల వాతావరణం కోసం మేము ప్రభుత్వం ముందు ఎలాంటి పెద్ద డిమాండ్లు పెట్టలేదు లేదా షరతులు విధించలేదు. ఎన్కౌంటర్ల పేరిట ఆదివాసీలను అమానుషంగా చంపడం ఆపేయాలని మాత్రమే చెప్పాము. అన్ని సాయుధ దళాలను ఆరు నెలల వరకు పోలీసు స్టేషన్లకు లేదా క్యాంపులకు పరిమితం చేయాలని చెప్పాం. మీరు ఎన్ని క్యాంపులు ఏర్పాటు చేసినా సరే, వారిని ఆరు నెలల వరకు క్యాంపులోనే ఉంచండి. బయటికి తీసి సోదాలకు, చర్యలకు పంపవద్దు. కొత్త క్యాంపులను ఏర్పాటు చేయవద్దు. మీరు ఏర్పాటు చేసిన క్యాంపులను తొలగించకపోతే కనీసం కొత్త వాటిని ఏర్పాటుచేయవద్దు. రెండు వైపులా కాల్పులు జరగకూడదు’’
ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే చర్చల పట్ల నిజాయితీలేదని ` బహిర్గతం చేయాలని, ఆపరేషన్ కగార్ కింద ప్రజలపై కొనసాగుతున్న ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా స్వరం పెంచాలని కూడ ఈ ప్రకటనలో ఉంది.
హోం మంత్రి విజయ్‌శర్మ చర్చలకు సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు కానీ, ఆయన అటువంటి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపించడంలేదని, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నించడమే గదా అని కూడ వికల్ప్ ప్రశ్నించాడు. వీటికి వేటికీ స్పందించకపోవడమే కాకుండా బస్తర్ వంటి అటవీ ప్రాంతంలో హోంమంత్రి చర్చల కోసం సూచించే వనర్లు కాన్షÛరెన్సింగ్ ద్వారా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం చాల హాస్యాస్పదమైన ప్రతిపాదన. ‘ప్రజలు చరిత్రను నిర్మిస్తారనే’ చారిత్రక, గతితార్కిక మౌలిక అవగాహనపై సాయుధ వర్గ పోరాటంలో ఉంటూ, జనతన రాజ్యాన్ని రెండు దశాబ్దాలుగా స్వావలంబనపై ఆధారపడి నడుపుతున్న మావోయిస్టు పార్టీతో హిందుత్వంపై, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు భావజాలంపై ఆధారపడి ఇవిఎంలతో ఎన్నికయిన ప్రభుత్వం ఎదురుబొదురుగా, పారదర్శకంగా కాకుండా సాంకేతిక విజ్ఞానంపై, యంత్రాలపై ఆధారపడి చర్చల ప్రతిపాదన చేసే ప్రభుత్వానికి ఎంత నాటకీయత ఉందో అర్థమవుతూనే ఉన్నది. అయితే నేను ప్రభుత్వం అని అంటున్నాను కానీ ఇది కేవలం హోం మంత్రి నుంచే వస్తున్న ప్రతిపాదన. ఆయన హోం మంత్రిగా మంత్రి వర్గ ఆమోదంతో, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ ప్రతిపాదన చేస్తున్నాడనడానికి కూడ ఆధారాలు లేవు. ఇక్కడ గత ప్రభుత్వాల ఉదాహరణలు చూడాలంటే 1. కేంద్రంలో వాజ్‌పాయి ఎన్‌డిఎ ప్రభుత్వం నాగా నేషనల్ విప్లవ ప్రభుత్వ ప్రధాని మువయ్యాతో ఉభయులకూ అంగీకారమైన మూడో దేశంలో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కాకున్నా అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికీ ఆ జాతి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవ ప్రభుత్వం పాటిస్తున్నది ఇటీవలనే తమ జెండాను, తమ స్వయం ప్రతిపత్తిని అంగీకరించకపోతే సీజ్ఫైర్ వెనక్కి తీసుకుంటామని కూడ ప్రకటించింది.
2. ఇంక ఆంధ్రప్రదేశ్‌లో అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడంతో పాదయాత్ర తర్వాత గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రిగా సాయుధంగా యూనిఫారాలతో ఏకంగా కరీంనగర్ ఎస్పి ప్రవీణ్‌కుమార్ ద్వారా సరెండరయిన జిల్లా కమిటీ (జనశక్తి) కార్యదర్శి రణధీర్ నాయకత్వం వలెనే, పీపుల్స్‌వార్ నుంచి కూడ గణనీయమైన సంఖ్యలో బయటికి వస్తారనే భ్రమలు కూడ ఉండవచ్చు. కాని హోం మంత్రి జానారెడ్డి చేసిన ఏ ప్రయత్నాలకు అడ్డుపడలేదు. అట్లని ఆసక్తీ చూపలేదు.
ప్రత్యేకించి ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ రోజు ముంబై ఎడిషన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుడియో సాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ అచ్చంగా ‘గణనీయమైన సంఖ్యలో’ విప్లవకారులు చర్చల ద్వారా సరెండర్ అవుతారన్న అవగాహనతోనే ఉంది. అందుకోసం ఆయన వాళ్ల మీద ఒక అభాండం కూడ వేసాడు. సంచలనం కోరుకునే జూట్ప్రెస్ సహజంగానే దానిని ఇంటర్వ్యూకి శీర్షిక చేసింది. ‘‘నక్సల్స్ రెఫర్డ్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్ యాజ్ అవర్ గవర్నమెంట్ (చీaఞaశ్ర్ణీం తీవటటవతీవస ్‌శీ ్‌ష్ట్రవ జశీఅస్త్రతీవంం స్త్రశీఙ్ aం శీబతీ స్త్రశీఙ్. నక్సల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ గవర్నమెంటుగా ప్రస్తావించేవాళ్లు’’అని).
బిజెపి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి నక్సల్ వ్యతిరేక చర్యలు (ఆపరేషన్స్) పెరిగిపోయాయి. గత సంవత్సరం 24 మంది చనిపోతే (ఎన్కౌంటర్లలో) ఈ మొదటి మూడు నెలల్లో 31 మంది (ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఇద్దరు ‘మరణించిన’ ఎన్‌కౌంటర్‌తో కలిపి 29G2R31) చనిపోయారు. అందువల్లనే ఎన్కౌంటర్ల గురించి చాల ప్రశ్నలు వస్తున్నాయి. అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి జవాబు ఇది (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 27`03`24)
‘గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సల్ వ్యతిరేక చర్యలు (ఆపరేషన్స్) చాల బలహీనంగా ఉన్నాయి. నక్సల్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘‘మా ప్రభుత్వం’’ అని చెప్పుకోవడం మేం విన్నాం. మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం వాళ్లతో పోరాటాన్ని శక్తిమంతం చేసింది. మా హోం మంత్రి (విజయశర్మ) కూడ ఈ విషయంలో పట్టింపుతో ఉన్నాడు. ఇంకో చెంపన సరెండర్ కాదల్చుకున్న నక్సలైట్లకు న్యాయం జరిగేలా హామీ పడాలని కూడ మేం నిర్ణయించుకున్నాం. వాళ్లు ప్రధాన స్రవంతిలోకి రావాలనుకుంటే వాళ్లతో మేం సంభాషించడానికి కూడ సిద్ధంగా ఉన్నాం. (సిద్ధంగా ఉన్నాం అని కూడ స్పష్టంగా చెప్పలేదు. ఔవ షaఅ ష్ట్రaఙవ సఱaశ్రీశీస్త్రబవ – మేం మాట్లాడ వచ్చునని అన్నాడు) కనుక ఆయుధాలు వదిలిపెట్టి వస్తే చర్చలు అన్నది 2002 చంద్రబాబునాయుడు ప్రభుత్వం (జూన్ 9, 2002) తో మొదలయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ విడత చర్చల సందర్భంగా పునరావృతం అయి ఇపుడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బిజెపి విష్ణు దేవ సాయి వరకు కొనసాగుతున్న ప్రభుత్వాల రాజ్య వైఖరి. తేడా అల్లా ఛత్తీస్‌గఢ్‌లో రాజ్యం ఈ మావోయిస్టుల వ్యతిరేక చర్యలు`అభియాన్లతో మొదలుపెట్టి, సాల్వాజుడుం స్థాయికి వెళ్లి, గ్రీన్‌హంట్ ఆపరేషన్ నుంచి, సమాధాన్, ఇపుడు ఆపరేషన్ కగార్గా రూపాంతరం చెందింది. సారాంశం ఒకటే.
మరొక తేడా పై అన్ని సందర్భాల్లోనూ ముఖ్యమంత్రులు, కేంద్రంలో ప్రధానులతో సహా (వాజ్‌పేయీ` అద్వానీ, మన్మోహన్సింగ్`చిదంబరం) హోం మంత్రులు అందరూ అగ్రవర్ణాల వాళ్లు. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవాళ్లు. బిజెపి రమణ్‌సింగ్ ఆదివాసేతర ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేతయే కాదు, ఆదివాసీ దళారీ అయిన మహేంద్రకర్మ (కాంగ్రెస్) సాల్వాజుడుం ఏర్పాటు చేసాడు. ఇప్పుడు ఆదివాసీ ముఖ్యమంత్రి విజయ్ శర్మ అనే అగ్రవర్ణ హోం మంత్రిని హిందుత్వ బ్రాహ్మణీయ భావజాల ప్రతినిధిగా ముందుపెట్టాడు.
చర్చలు ముప్పేట దాడికి ఒక ఎత్తుగడగానే ప్రభుత్వాలు చేస్తున్నాయి.