సాధారణ రాజకీయ పంథాలో ఛైర్మన్ గొంజలో వివరణలు, ప్రపంచ విప్లవానికి అందించిన రచనలు:
మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం లేకుండా, గొంజలో ఆలోచనా విధానాన్ని ఊహించలేము, ఎందుకంటే అది మన వాస్తవికతక మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు సృజనాత్మక అనువర్తనం. శ్రామికవర్గ భావజాలపు చారిత్రక అభివృద్ధిని, మావోయిజం ప్రధానమైనదిగా ఆ భావజాలం మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా రూపుదిద్దుకున్న మూడు దశలను అర్థం చేసుకోవడం అనేది ఇందులో కీలకాంశం. సారాంశంలో, మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని ఒక విశ్వజనీన సత్యంగా పెరూ విప్లవ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడం అనేది ప్రధానమైనది. అందువల్ల గొంజలో ఆలోచనా విధానం పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విప్లవానికి ప్రత్యేకంగా ప్రధానమైనది. గొంజలో ఆలోచనా విధానంలోని అత్యంత దృఢమైన, అభివృద్ధి చెందిన భాగం పార్టీ సాధారణ రాజకీయ పంథాలో కనపడుతుంది.
పార్టీకి సేవ చేయడానికి, ప్రజా యుద్ధ అభివృద్ధికి ప్రపంచ శ్రామికవర్గ విప్లవానికి మరింత మెరుగ్గా సేవలందించడానికి గొంజలో ఆలోచనను అధ్యయనం చేయడం, ప్రధానంగా అమలు చేయడం నిర్ణయాత్మకమైనది. అందువల్ల హృదయపూర్వకంగా ప్రజలకు సేవ చేయడాన్ని ఛైర్మన్ గొంజలో నుండి నేర్చుకోవాలి.
పెరూ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కాంగ్రెస్.
I అంతర్జాతీయ పంథా
1. మార్క్సిజపు నూతన, మూడవ, ఉన్నతమైన దశగా మావోఆలోచనా విధానాన్ని అమలుచేయడానికి పోరాటం.
2. సామ్రాజ్యవాద ప్రపంచ యుద్ధానికి ప్రతిస్పందనగా ప్రపంచ ప్రజల యుద్ధం.
3. మౌలిక వైరుధ్యాలు-వాటి పరిష్కారం: ప్రధాన వైరుధ్యం.
4. ప్రపంచ విప్లవపు మూడు క్షణాలు: ప్రపంచ విప్లవ వ్యూహాత్మక దాడి.
5. ప్రపంచ విప్లవంలో వ్యూహం- ఎత్తుగడల కోసం స్థావరాలను అభివృద్ధి చేయండి.
6. మార్క్సిజం ప్రక్రియ.
7. సమకాలీన రివిజనిజపు పూర్తి దివాలాకోరు తనపు నిర్వచనం.
8. సామ్రాజ్యవాదం, రివిజనిజం, ప్రపంచ ప్రతిఘాతుకాలతో నిర్దయగా పోరాడండి.
II పెరూ ప్రజాస్వామిక విప్లవ పంథా
1. పెరూలో విప్లవాన్ని ఎలా చూడాలి: కమ్యూనిజం వరకు ప్రజాస్వామ్య విప్లవం, సోషలిస్ట్ విప్లవం, శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (మూడవ రకం విప్లవంగా వివరించారు).
2. నిరంకుశ పెట్టుబడిదారీ విధానపు సాధారణీకరణ.
3. పెరూ సమాజ లక్షణాలు, ప్రాథమిక వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం.
4. రాజ్యం గురించి: పాత రాజ్యం, కొత్త రాజ్యం.
5. ప్రజాస్వామిక విప్లవ సారాంశం: పీపుల్స్ వార్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని రైతాంగ యుద్ధం.
III. సైనిక పంథా
1. ప్రజా యుద్ధంలో నిర్దిష్టం చేసిన విప్లవకర హింస సూత్రాన్ని విశ్వజనీన నియమంగా పునరుద్ఘాటించడం.
2. ఏకీకృత ప్రజా యుద్ధం, చొరవకు వున్న ప్రాముఖ్యత.
3. మద్దతు ఆధార ప్రాంతాల వివరణ.
4. వ్యూహాత్మక అభివృద్ధి-వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళిక.
5. కేంపెయిన్ ఐదు భాగాలు.
6. కార్యాచరణలోని ఐదు దశలు.
7. వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలు.
8. ప్రజాసైన్యం ద్వారా ప్రజల్లో కృషి.
IV విప్లవంలో మూడు ఉపకరణాల నిర్మాణ పథం
1. నిర్మాణ సూత్రం.
2. కమ్యూనిస్ట్ పార్టీల సైనికీకరణ: కేంద్రీకృత నిర్మాణం.
3. ప్రజా గెరిల్లా సైన్య నిర్మాణం: మిలీషియా విలీనం.
4. గ్రామీణ రంగం: నూతన రాజ్యం (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ నిర్మాణ దిశగా ప్రజా కమిటీలు, మద్దతు ఆధార ప్రాంతాలు, పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ పెరూ నిర్మాణ దిశగా). పట్టణ రంగం: రివల్యూషనరీ మూవ్‌మెంట్ ఇన్ ది డిఫెన్స్ ఆఫ్ ది పీపుల్ (MRDP)(ప్రజల రక్షణ కోసం విప్లవోద్యమం).
5. నూతన అధికారపు ఆరు రూపాలు: ప్రజాధికార సంస్థాగత కమిటీ, ప్రత్యామ్నాయ అధికార ప్రజా కమిటీలు, ప్రజా కమిటీలు, బహిరంగ ప్రజా కమిటీలు, ప్రజా పోరాట కమిటీ.
6. మిలిటెన్సీ: కమ్యూనిస్టులు మొదటగా, అందరికంటే ముందు, యోధులు, నిర్వాహకులు.
7. నిర్మాణ వ్యూహం.
V. ప్రజా పంథా
1. ‘ప్రజలే చరిత్ర నిర్మాతలు, తిరుగుబాటు చేయడం వారి హక్కు’ అనే సూత్రం పున:నిర్ధారణ.
2. ప్రపంచ విప్లవంలో ప్రజల నిర్దిష్ట భారం (ప్రపంచంలోని ప్రధాన వైరుధ్యాన్ని నిర్వచించడానికి ఉపయోగపడుతుంది).
3. ప్రజా యుద్ధంలో, ప్రజా యుద్ధం కోసం ప్రజల్లో కృషి. గ్రామీణ ప్రాంతాలు; పట్టణాల్లో నాయకత్వం.
4. పాలకులకు సేవ చేసే వారి రోజువారీ డిమాండ్ల కోసం పోరాటం.
5. ఉత్పాదిత జీవులు, గ్రామీణ ప్రాంతాల్లో సైనికీకరణ, నగరాల్లో నిర్దిష్టత.
6. ప్రజాయుద్ధంలో ప్రజలను విలీనం చేసే చట్టం.
7. ఏకైక మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్, గొంజలోఆలోచనా ఎత్తుగడలు.
8. పేదరికపు శాస్త్రీయ సమీకరణ.
9. ప్రజల సాయుధ సముద్రం.
PCP- కేంద్ర కమిటీ
ఫిబ్రవరి, 1994