తల్లి బిడ్డకు జన్మనివ్వడం
మరో జన్మతో సమానమని తెలిసినా
తను మాత్రం బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుంది
బిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఆనందం అపారం
పునరుత్పత్తి సామాజిక విలువ తెలిసిన
“తల్లి” గొప్పతనం అదే కదా!
ఈ రోజు ఎందరో కన్న తల్లులు
తమ బిడ్డలు తమ కళ్ల ముందు
లేరని బాధపడుతున్నా, ఎక్కడో కాని
పీడిత తాడిత జనం కొరకు రణం చేస్తున్నందుకు
మురిసిపోతూ గర్విస్తున్నారు.
తల్లి ప్రేమ ఒక్క మాటలో చెప్పలేం
అమ్మ ప్రేమకు కొలామానం ఏది?
“కగార్” అనేక మంది కన్నతల్లులకు
గర్భ శోకాన్ని మిగులుస్తుంది
సమాజ మార్పు నూతన శిశువుకు
జన్మనివ్వడంతో సమానమని
ఎరిగిన తల్లులు సామాజిక మార్పు కోసం
బిడ్డల భవిత కోసం భరిస్తున్నారు
కానీ, ఆ తల్లులు ఆగ్రహించే రోజు
వచ్చి తీరుతుంది
ఎన్ని కగార్ లనైనా అది తిప్పి కొడుతూ
బిడ్డల ఆశయాలను నెరవేరుస్తుంది.
Related