ఫిబ్రవరి 21న పంజాబ్ – హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.

22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. హర్యానా పోలీసులు అతని మరణంపై మౌనంగా ఉన్నప్పటికీ, పటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) హెచ్ఎస్ భుల్లర్ విలేకరులతో మాట్లాడుతూ, భద్రతా దళాలు రైతులపై రబ్బరు బుల్లెట్లను కాల్చినప్పుడు శుభ్‌కరణ్ మరణించినట్లు అనుమానం ఉంది. హర్యానా పోలీసుల బారికేడ్‌లను విచ్ఛిన్నం చేయడానికి రైతులు  ప్రయత్నించడం వల్ల  అలా జరిగిందని డిఐజి చెప్పాడు.

పటియాలా లోని ప్రభుత్వ రాజీంద్రా ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రాథమిక పరీక్షలో అతని మరణం తూటా తగలడం వల్ల జరిగిందనే సందేహం వ్యక్తమైంది.

ఫిబ్రవరి 22 న జరిగే శవపరీక్ష తరువాత మరింత స్పష్టత వస్తుంది. ది హిందూ నివేదిక ప్రకారం, రైతులు తమ డిమాండ్లను అంగీకరించమని ఒత్తిడి తేవడం వల్ల శవపరీక్ష ఆలస్యం అయింది.

ఈ ఘటనతో కకావికలైన శుభ్‌కరణ్  కుటుంబం అతని మరణానికి కారణం హర్యానా ప్రభుత్వమే అని నిందించింది. హర్యానా పోలీసులు నిరసనకారులపై మితిమీరిన చర్యలు తీసుకున్న కారణంగానే ఆయన మరణించినట్లు శుభ్‌కరణ్ మామ బూటా సింగ్ తెలిపారు.

రైతుల ‘ఢిల్లీకి వెళ్దాం’ యాత్ర ముందుకు వెళ్లకుండా అడ్డుకుని  అరాచకం సృష్టించింది వారే. రైతులకు శాంతియుతంగా యాత్ర చేయడానికి అనుమతి యిచ్చి ఉంటే, శుభ్ జీవించి ఉండేవాడు హర్యానా పోలీసుల తీవ్ర చర్యలే తన కుటుంబాన్ని నాశనం చేసాయని ఆయన అన్నారు.

“శుభ్ తండ్రి చరణ్‌జిత్ సింగ్ ఒక చిన్న రైతు, అతనికి 2.5 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే వుండి.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. విపరీతమైన అప్పుల్లో మునిగిపోయారు. శుభ్ తన వృద్ధ , ఇద్దరు చెల్లెళ్లకు వున్న  ఏకైక ఆశ.  శుభ్‌కరణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక అమరవీరుడి హోదా ఇవ్వాలి, అతను ఒక గొప్ప ఆశయం  కోసం తన ప్రాణాలను అర్పించాడు అన్నారు.

అంతేకాకుండా, ఆయన కుటుంబానికి తగినంత పరిహారం ఇవ్వాలి. అతని సోదరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం యివ్వాలి. వారి కుటుంబం ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును రద్దు చేయాలి.

ఇంత చిన్న వయసులోనే ఇలాంటి విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని గ్రామమంతా దుఃఖంలో మునిగిపోయింది అని అన్నారు.

కాంగ్రెస్, శిరోమణి అకాలి దల్ (ఎస్ఏడీ) లతో సహా ప్రతిపక్ష పార్టీలు శుభ్‌కరణ్ సింగ్  మరణానికి, పంజాబ్ ప్రస్తుత పరిస్థితికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నాయి. అకాలిదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బదల్ ఎక్స్ పై ఒక పోస్ట్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుట్రపూరిత ద్వంద్వ వైఖరి ఆట ఇద్దరు చెల్లెళ్ల  ఏకైక సోదరుడి మరణానికి కారణమని ఆరోపించారు.

పంజాబ్ నేల మీద పంజాబీలపై దాడి చేయడానికి, చంపడానికి ఇతర రాష్ట్ర పోలీసులకు అనుమతి ఉంది. పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా భగవంత్ మాన్ హర్యానాకు సహకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల్లో  తూటాలు తగలగడం అనేది ఎపుడూ  వినలేదు. శుభ్‌కరణ్ సింగ్  అమాయక రక్తం భగవంత్ మాన్  చేతులకు అంటుకుంది అని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 22 న చేసిన మరో పోస్ట్ లో, పంజాబ్ లో నిన్న (ఫిబ్రవరి 21) హర్యానా పోలీసుల కాల్పుల బాధితుడైన శుభ్‌కరణ్ సింగ్ కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సహాయం అందించడంపై భగవంత్ మాన్ చేసిన  ప్రకటనను ఎవరూ విశ్వసించలేరని ఆయన అన్నారు.

కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని అకాలి దళ్ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. అంతే కాకుండా , పోలీసుల దౌర్జన్యం  వల్ల ప్రభావితమైన ఇతర రైతులకు ప్రభుత్వం సాధ్యమైనంత సహాయం అందించాలి.

పంజాబ్ నేలపై పంజాబ్ రైతులపై ఈ విధ్వంసాన్ని సృష్టించడంలో హర్యానా పోలీసులకు సహాయం చేసిన నైతిక, చట్టపరమైన బాధ్యతను భగవత్ మాన్ అంగీకరించాలి. పంజాబ్ క్యాబినెట్ ఈ రోజు అలా చేయకపోతే షిరోమణి గురుద్వారా మేనేజింగ్ కమిటీ అమృత్‌సర్‌ సహాయం కోసం ముందుకు రావాలని అభ్యర్థించాను అని అన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి భగవత్ మాన్ శుభ్‌కరణ్ మరణానికి బాధ్యత వహించిన వారిని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తన ప్రభుత్వం విచారణ జరపనుందని, దోషులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆయన విలేకరులతో అన్నారు. ఆప్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు కూడా యువ రైతు హత్యను ప్రజాస్వామ్య హత్యగా ఖండించారు.

ఖనౌరీ సరిహద్దులో చనిపోయిన రైతు శుభ్‌కరణ్ సింగ్ సోదరికి 1 కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, దోషులకు వ్యతిరేకంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  భగవత్ మాన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రకటించారు.

రైతుల నిరసనలో గాయపడినవారి  సంఖ్య పెరిగింది  మరోవైపు, సరిహద్దుల్లో గాయపడిన రైతులు, కార్యకర్తల సంఖ్య 177కి పెరిగిందని పంజాబ్ ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ధృవీకరించారు. షంబు సరిహద్దులో 141 మంది, ఖనౌరి సరిహద్దులో 36 మంది గాయపడిన రైతులకు ఇప్పటివరకు మొత్తం 177 మందికి చికిత్స అందించామని పాటియాలా జిల్లా సివిల్ సర్జన్ రవీందర్ కౌర్ చెప్పారు.

అత్యధికులు టియర్ గ్యాస్ బాంబులు లేదా రబ్బరు బుల్లెట్ల కాల్పుల వల్ల గాయపడ్డారని,  చికిత్స పొందుతున్న 10-12 మంది రోగులను మినహా మిగతావారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆమె తెలిపారు.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నిరసన స్థలంలో ఇద్దరు సహజ మరణం, ఒకరు అనుమానాస్పద కాల్పుల్లో మరణించారు.

గురుదాస్ పూర్ జిల్లాలోని చాచోకి గ్రామానికి చెందిన రైతు జ్ఞాన్ సింగ్ నిరసనల మధ్య మరణించిన మొదటి వ్యక్తి.  ఫిబ్రవరి 16 ఉదయాన్నే శంభూ సరిహద్దులో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఖనౌరిలో నిరసనలో ఉన్న 72 ఏళ్ల రైతు మంజిత్ సింగ్ ఫిబ్రవరి 19న గుండెపోటుతో మరణించాడు.

మంజిత్ బికెయు (క్రాంతికారి) యూనిట్ అధ్యక్షుడు, ఎస్‌కెఎమ్(రాజకీయేతర) సభ్యుడు, ఎంఎస్పికి చట్టపరమైన హామీతో సహా అనేక డిమాండ్లపై మజ్దూర్ సంఘర్ష్ సమితితో కలిసి ‘ఢిల్లీ వెళ్దాం’ నిరసన యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు.

23/02/2024

https://thewirehindi.com/269023/farmers-protest-deceased-youth-s-family-blame-haryana-police-177-hurt-at-borders-since-feb-13/
https://thewire.in/agriculture/farmers-protest-haryana-police-shubhkaran-singh

Leave a Reply