ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ముందు నుయ్యి, వెనుక గొయ్యి
మేం ఎం.ఏ చదువుతున్నరోజుల్లో మా ప్రొఫెసర్ ఒకాయన తరచుగా “There is nothing to choose between two fools” అనేవారు. ఎవరిని గురించో ఇప్పుడు జ్ఞాపకం లేదనుకోండి. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు “There is nothing to choose among these cheaters” అని జగన్, పవన్, బాబు, బిజెపి ల గురించి అనాల్సిరావడం ఒక విషాదమoదామా? లేక ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయాలు లేవని సరిపుచ్చుకుందామా? మొన్నటివరకు జగన్ ప్రత్యక్ష మద్దతు తీసుకుంటూ, అతనికి పరోక్ష మద్దతునిస్తూ, అతన్ని అరెస్టుల నుండి కాపాడుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశంతో జత