వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల