వ్యాసాలు

రాజకీయార్థిక విధానం-బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం

బ్రాహ్మణీయ హిందూత్వ పుట్టుకకు అర్థభూస్వామ్య అర్థవలస సామాజిక ఆర్థిక వ్యవస్థే పునాది. పెటీబూర్జువా ఫాసిజం కన్నా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం భిన్నమైనది. ఇది కులవ్యవస్థను నూతన రూపంలో బలోపేతం చేసే భూస్వామ్యతరహా ఫాసిజం. హిందూత్వ అంటే, రూపంలోనూ సారంలోనూ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉండే హిందూమతంలో ఏకరూపతను సాధించడం. భారత సమాజంలోని ప్రత్యక్ష, పరోక్ష వైరుధ్యాల ఫలితంగా ఏర్పడిన భౌతిక పునాదే పై కేంద్రీకరణను ఉత్పన్నం చేస్తుంది. సామాజిక నిర్మితిని సామాజిక, ఆర్థిక సంబంధాల రూపవ్యక్తీకరణే హిందూ సామాజిక నిర్మాణం. కాబట్టి హిందూత్వ ఫాసిజపు పుట్టుకను, పెరుగుదలను అర్థం చేసుకోవాలంటే దాన్ని సృష్టించిన భౌతిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి.