కవిత్వం

నా కవిత్వం ప్రయోగశాల

కవిత్వమొక అంతర్నిర్మిత జ్వాలా రౌద్రాన్వేషణ రక్త ప్రవాహల్లో ఎదబీటల స్పర్శఅనుఘర్షణ స్పర్శాను ఘర్షణ కాలం కనురెప్పపై ఎప్పటికీ ఆరని నీటిచెమ్మనై అగాధపు తిమిరంలో వెన్నెల రేయిలా నను స్పర్శించేదీ కవిత్వమే కవిత్వమే కవిత్వమంటే నిరంతర జ్వలితం, నిరంతర రక్త ప్రవాహం కదిలే కాలగమనాన్ని మదిలో మెదిలే కన్నీటి సంద్రాన్ని వర్ణించేది కవిత్వమే... ఇప్పుడే వికసించిన తొలి అంకురాన్ని అప్పుడే ప్రసవించి రెప్ప విప్పకుండా పొదల్లో ఏడ్చి స్పృహ కోల్పోయిన ఆడబిడ్డ నిద్రని వర్ణించేది కవిత్వమే కవిత్వమొక ప్రయోగశాల ప్రతి ప్రయోగంలో సరికొత్త ఆవిష్కరణ ప్రతి పదంలో వింత్తైన పాదరస వైవిధ్యం ప్రళయకాలంలో ప్రభంజన గర్జనలా హృదయాంతాలలో అగ్ని పర్వతంలా