సాహిత్యం సంభాషణ

అమ్మల దినం తల్లుల గుండెకోత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం. అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా