సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
కాలమ్స్ లోచూపు

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
కాలమ్స్ లోచూపు

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
కాలమ్స్ లోచూపు

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా