కవిత్వం

నా నగర మేదీ

** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం