కాలమ్స్ కవి నడిచిన దారి

ఒక్కడుగు

అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే' దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే