ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా