సంభాషణ

ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబాకు న్యాయం జరగాలి

2022 డిసెంబర్ 5 ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు యిచ్చిన విడుదల ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టును ఉత్తర్వును  పునరుద్ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ 18 మానవ హక్కుల సంస్థలతో కలిసి స్కాలర్స్ ఎట్ రిస్క్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబ క్షేమాన్ని గురించి  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈమెయిలు ద్వారా గౌరవనీయులైన ధనంజయ వై. చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తి 2022 డిసెంబర్ 5 విషయం: ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబాకు న్యాయం చేయడం గురించి (డైరీ నం. 33164/2022) ప్రియమైన జస్టిస్ చంద్రచూడ్ గారికి, అహింసాయుతమైన భావవ్యక్తీకరణచేసినందుకు ప్రతీకారంగా జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా క్షేమం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచేందుకు, ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు విడుదల ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టు