కవిత్వం

వినవమ్మా…

నీకు 75 ఎండ్లంటా..రోడ్ల వెంట నివాసం ఉన్నకాలి కడుపును నింపలేనందుకు,ప్రతి పుట సంబరాలు జరుపుకో.. సడక్ సందులో గుడిసేపైకప్పు లేదు,త్రివర్ణ పతాకాన్ని కప్పుదాం అంటే,శుద్ధ నీతులు చెప్పే "దేశ భక్తుల" కత్తులుఎక్కడ నా కడుపులో దిగుతాయని భయంగా ఉంది తల్లి.. నువ్వు నన్ను కన్నవంట కదమ్మ,నా జననం మురికి కాలువలోఎందుకు జరిగిందో,కొంత మంది పుట్టుక అద్దాలమేడలో ఎందుకు జరిగిందో నాకిప్పటకి తెలియదమ్మా.. మూడు రంగులునీకు అలంకరిస్తున్నరమ్మా..మాకేంటి తల్లి ఎప్పటికి జీవితాల్లో"నలుపే" కనపడుతుంది..? 75 సంవత్సరాల వయసున్న నీకు..నా దుఃఖం ఎప్పుడు వినపడుతుంది చెప్పమ్మా..?
కవిత్వం

ఎగరేద్దాం జెండాని

ఎగరేద్దాం జెండానిఆగస్టు 15 ఆనవాయితీ గదాఎగరెయ్యాల్సిందే!అయితే‌ నాదో విన్నపం…ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయోఅన్నిటినీ దారంగా కట్టిమరీ ఎగరేద్దాం!.కష్టాల్నీ,కన్నీళ్ళనీ,బాధల్నీ,దీనుల గాధల్నీజెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం! తస్మాత్ జాగ్రత్త!జెండా ఎగరెయ్యకపోతేNIA వాళ్ళుమన ఇళ్ళ కొస్తారుఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారుఎందుకొచ్చిన ఖర్మ?ఎగరేద్దాం జెండాని!75 ఏళ్ళుగాపేదల నిట్టూర్పులఉసురు పోసుకున్నజెండాని ఎగరేద్దాం! ఇంటింటిపై ఎగిరిన జెండాలుఆగస్టు 15 తర్వాతవీథుల్లో,చెత్త కుప్పల్లోపడి దొర్లాడుతుంటేపాపం పింగళి వెంకయ్యఎక్కడున్నాడో!ఆయన ఆత్మకుశాంతి కలగాలనిలేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!47 లో డాలర్ కునాలుగు రూపాయలేఈనాటికి80 రూపాయలయ్యాయనిచంక లెగరేసుకొనిఎగరేద్దాం జెండాని!దేశంలో ఎన్ని సవాళ్ళు!ఎన్ని ఉరితాళ్ళు!నోళ్ళు తెరుచుకొంటున్నఎన్నెన్ని జైళ్ళు!అన్నిటినీ గానం చేస్తూఎగరేద్దాం జెండాని!ఎగిరే జెండాని చూసిప్రజా స్వామ్యంవిరగబడి నవ్వకముందేమత్తు వదిలినిద్ర లేవకముందేఎగరేద్దాం జెండాని!
సాహిత్యం కవిత్వం

నూతన మానవుడు

అస్తమించడమంటే రేపటి సూర్యోదయమే కదా అతడు అస్తమించాడు తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు శాంతి పావురంకు  ప్రజలంటే ఎంత పావురం విద్రోహ పొగమబ్బుల మధ్యనే శాంతి కపోత పతాకమెగిరేశాడు మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి జన ఎజెండా జెండా నాటి ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు పంతులు కదాప్రపంచ గమనాన్ని తన వేకువ వెలుగు దారుల్లో చూపించి జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు అతని కిరణాలు అరికాళ్ళు నాటిన అడుగుల నిండుగా జగిత్యాల జైత్రయాత్రలు...జంగల్ మహల్ రెపరెపలు... కన్నతల్లుల కడుపుకోత
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
కవిత్వం

నువ్వే కావాలి

ఎందుకో నువ్వంటేతెగ పిచ్చితీగలా అల్లుకు పోయిలోలోన ప్రకంపనలు సృష్టిస్తావు నిన్నునాలో సాన బట్టుకుంటూపదిలంగా దాచుకుంటా నువ్వే నా చుట్టూపెట్టని కోటవైనా రక్షణ గా ఎల్లవేళలా నువ్వే లేకపోతేనేను అజ్ఞాని గాఎక్కడ బడితే అక్కడ తిరిగే వాడ్నినన్నో మనిషి గా నిలబెట్టినది నీవే నాకు నేనుగాఊహ తెలిసిన దగ్గరి నుండినీ చుట్టే నా పరిభ్రమణంఅదే నా ఉజ్జ్వల భవిష్యత్తు కిరాచ బాట పరిచింది ఏదైనా తెలుసుకోవాలంటేనీవే నా ఆధారంతరాలుగా నీవూ నేనూకలిసి సాగామనే ఆలోచనలునన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటేఇలాగే భవిష్యత్తు లో కూడాసాగాలనే తాపత్రయంలో స్వార్థమున్నాతప్పట్లేదు నీ రూపం అపురూపంనాలో చెరగని రూపంచెక్కుకుంటూ పోలేనుఎప్పటికప్పుడు చెక్కక తప్పదుచెక్కితేనే నీ విలువ
సాహిత్యం కవిత్వం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
కవిత్వం

సెంట్రి..!

రాత్రి చెందురుడు మా పల్లె మీద రాబందులు వాళ్ళకుండా డేగ కండ్లతో కాపు కాస్తున్నవాళ్ళు..!పూరి గుడిసెల వాడల్లోనిట్టాడుగా నిలిచిన చోట అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన పసికూన కూతకు తుఫాకి మోన పెట్టి కాల్చాలని కలగన్న ఈ దోపిడీ రాజ్యాన్ని ధిక్కరించే తెగువైకాచిన కందిలి వెలుగులు వాళ్ళు..!!అడవి కాచిన వెన్నెల సంద్రాలను ఈదుతూ సెలయేరు పాయలుగా పారుతూ కొండలు, కోనలను తడుముతూ సకల జీవరాశులను ఓల్లో ఒంపుకుంటూ చుక్కాని అయిన వాళ్ళు ఈ దేశ పీడిత ప్రజలకు సెంట్రియే...!దిక్కు తెలియని వాళ్ళకు దిక్కై నలుదిక్కుల న్యాయముకై విముక్తి నావనెంచి సాగుతున్న వాళ్ళకు పోరు సమరంలో వాళ్లో స్నేహితులు
కవిత్వం

గుడిపల్లి నిరంజన్ రెండు కవితలు

1 .నలిపెడుతున్న భావమేదో..! ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది. అమ్మ పోయినప్పుడో నాన్న ఊపిరి ఆగినప్పుడో మనసు వెన్ను విరిగినప్పుడో అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో.. దారితప్పినప్పుడో... ఎప్పుడో ఒకప్పుడు ఊపిరాడని స్థితి అందరికీ వస్తుంది. పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో.. కయ్యాలు కురిసినప్పుడో గింజలు మొలువనప్పుడో కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో.. అప్పుడే సోప్ప బెండులా అల్కగా బరువు తగ్గిపోతాం. ఈనెపుల్లలా సన్నగా మారుతాం. ఒక్కోసారి మనసు లోపల కసిబిసితో నలిపెడుతున్న భావమేదో బయటికి ఉసులుతుంది. అప్పుడే ఏమీతోచని స్థితి వేడి శ్వాసల రూపంతో బయటకు
కవిత్వం

ఇనుప మేకుల భూమి

భూతల్లి ఎదపై నాటిన ఇనుప మేకులు ఎవరి ఆకలిని తీర్చగలవు? ఎంత పచ్చదనాన్ని తుంచగలవు?? ఆ సిమెంట్ బ్యారి గేట్లు ఎవరి ఇంటికి గోడలుగా నిలబడగలవు? ఎంత ధైర్యాన్ని అణచగలవు?? గాలిలో ఎగిరే డ్రోన్లు ఎవరి పంట చేనులకు మందులు కొట్టగలవు? ఎంత ఆక్సిజన్ ను భర్తీ చేయగలదు?? వాడు చేస్తున్న దాడిలో కోల్పోయిన రైతుల ప్రాణాలను ఎవరు మొలకెత్తించగలరు? గడ్డిపోచల గుండె చప్పుడుతో ఊపిరి వీస్తున్న స్వదేశ రైతులను కట్టడి చేసే అట్టడుగుల్లో ఎంత కాలం కొట్టుమిట్టాడగలరు ?? రాజకీయం తెలిసిన ప్రభుత్వానికి రైతుల కన్నీటి బాధలను తీర్చడం తెలియనిదా? భారతరత్న అవార్డు ప్రకటనలో కూడా రాజకీయ
కవిత్వం

వర్షం లో రైతు

వాలే చినుకు లోఆశగా తడిశాను .బురద సాలుల్లో నారుగా మురిసాను .ఎండిన కలలని తడుపుతూవడివడిగా దున్నుకుంటున్నాను .ఎండలు శపిస్తాయోవానలు ముంచేస్తాయోకళ్ళనిండా  మేఘాలునిండి ఉన్నాయి .గుండెనిండా ధైర్యంపిండుకున్నాను .కాసింత ఉరుములు  భయపెడతాయికాసిన్ని పిడుగులు కూల్చేస్తాయికాళ్ళు మట్టి పెళ్ళల్లోఉదయించందేమనసు కుదుటపడదు .రెప్పల వాకిట్లోతెప్పలుగా కదిలే దృశ్యాల వెంటఆకు పచ్చని కలలుఊరటనిస్తాయి.ఊపిరి పోసినాఊపిరి తీసినామట్టిని నమ్ముకునేరైతు  జీవితం ముగుస్తుంది .