నివాళి

ప్రముఖ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావుకు విరసం నివాళి

సీనియర్‌ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావు ఫిబ్రవరి 6న చనిపోయారు. ఆయన తెలుగు కథా చరిత్రలో గుర్తు పెట్టుకోదగిన రచయిత. మూడు తరాల కథా వికాసం ఆయనలో కనిపిస్తుంది. 1950లలో ఆయన కథా రచన ఆరంభించారు. ఆ రోజుల్లో ని చాలా మంది కథకుల్లాగే ఆయనా మధ్య తరగతి జీవిత ఇతివృత్తం ప్రధానంగా రాశారు. సహజంగానే కోస్తా ప్రాంత సాంస్కృతిక ముద్ర ఆయన కథల్లో కనిపిస్తుంది. మానవ జీవిత సంఘర్షణను, వైచిత్రిని నిశితంగా చూసి రాశారు. చాలా మామూలు కథన శైలితో సాగే ఆయన కథల్లో ఇప్పటికీ మిగిలి ఉండేది ఆయన పరిశీలనాశక్తి, అందులోని విమర్శనాత్మకత.             కొన్ని
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ