విరసం సంతాపం
గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల సాంస్కృతిక అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర