పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి! ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు కూంబింగ్‌లు షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం