పోస్కో దారిలోనే జిందాల్ పోక తప్పదు
నేపథ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూమిని రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం దశాబ్దంపైగా నడిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణలతో అట్టుడుకుతున్నది. ఎప్పటిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది ఉంటున్నారు. వారిలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే