ఆకలి కడుపులతో అమృతోత్సవం!
బ్రిటీష్ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత