వ్యాసాలు

శుభ్‌కరణ్  హత్యకు హర్యానా పోలీసులే కారణం 

ఫిబ్రవరి 21న పంజాబ్ - హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. 22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.
సాహిత్యం వ్యాసాలు

ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు -ఒక సమీక్ష  

                                           రచయిత్రి నిత్య రాసిన "ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు "పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని "మహిళా మార్గం "పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు "ప్రజా రచయిత ప్రేమ్ చంద్ "అన్న పేరుతో ముందు మాట రాస్తూ "భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ "అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య
కారా స్మృతిలో వ్యాసాలు

కథతో ప్రయాణం

కారా మాస్టారు జనాపకాల్లోకి పోయేముందు మనం కథా ప్రక్రియ ఎందుకు ఎన్నుకున్నామో, ప్రేరేపించిన కారణాలు ఏమిటో ఆలోచిస్తేనే ఓ అనుభూతి! నాకు కలిసొచ్చిన అవకాశం ఏమిటంటే 8 వ తరగతి నాటికే మా ఇంట్ల అన్ని రకాల పుస్తకాయాలుండటం. మా పెద్దన్నయ్య వరంగల్ గాబ్రియల్ స్కూల్ విద్యార్థి. క్యాథలిక్ క్రిస్టియన్ ఫాదర్ గా శిక్షణ పొంది, చివరి దశలో ఎన్నో కారణాలతో బయటకు రావడం. అతనికి లిబరేషన్ థియాలజీ మీదున్న విశ్వాసం, మాటలు నన్ను ఆకర్షించేవి. హైదరాబాద్, విజయవాడ నుండి ఎన్నో పుస్తకాలు వచ్చేవి. అలా నాకు నవలలు, కథలతో పరిచయం ప్రారంభమైంది. ఎమిలీ జోలా నవల ‘భూమి’
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సాహిత్యం వ్యాసాలు

రారా విమర్శలో ఆధునికత ఎంత?

రాచమల్లు రామచంద్రారెడ్డి  గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం.  సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన  ప్ర‌త్యేక ముద్ర‌ వేశారు.  విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది.   తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.  అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు?  ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి?  పరిశీలించాలి. విమర్శలో  నిక్కచ్చిగా ఉంటాడని  ఆయనకు  పేరు.  కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.     మనం
వ్యాసాలు

ఇజ్రాయిల్ జైళ్ళలో పాలస్తీనా మహిళా జర్నలిస్టులు

పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో  “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే. ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు. 2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న
వ్యాసాలు

సత్యంపై గురి: గాజాలో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు 

 పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది. ముట్టడి - ప్రభావం ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష. ఏదేమైనా, ఆ యుద్ధ
కారా స్మృతిలో సాహిత్యం కవిత్వం

కథల తాతయ్య

గదిలో ఒకచోట ఖాళీ నిండిందిఆ వాలుకుర్చీని అల్లుకునిపాలపండ్ల చెట్టొకటి వుండేదికుర్చీ ముందువెనుకలకొన్ని ఆలోచనలు గాలిలో పూసిబహు నెమ్మది మాటలుగా వీచేవిచెవియొగ్గి వినాలి మనంజీవితాన్ని దున్నిన అనుభవాల పంటసేద్యం నేర్చినవాడు చెప్పిన కథ                o0oఅతను గడుసరి, అతను మనసరినిత్య చదువరిగంపెడు ప్రేమ, ఒకింత కోపం మెండుగా మొండితనంకూడికతో అతనొక పిల్లల కోడిమొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.దొంగ ఏడుపుల్ని ఎండగట్టిఅసలు దుఃఖపడుతున్న వాళ్లచెక్కిళ్ళు తుడిచాడు                         o0oమక్కువతో చేరదీసిన అన్నిటిపైనాదిగులుపడే తాతతనం నిండినమనిషొకడుండేవాడు యిక్కడఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళకుశలమూ ఆడిగేవాడుపిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్నతొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడుయీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.                            o0oకనిపించడుగానీ అన్నీ గమనించేవాడుమన
వ్యాసాలు

విలువ‌ల ప్ర‌తినిధి

ఆర్‌కే తన జీవిత పర్యంతం నమ్మిన రాజకీయాల్లో కొనసాగాడు. చాలా  కష్టాలు అనుభ‌వించాడు. ఆదర్శప్రాయంగా నిలిచాడు.   వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు కూడా ఇలాంటివ‌న్నీ త‌ల‌చుకుంటున్నారు.  ఒకప్పుడు ఆయనతో పని చేసినవాళ్లు చాలా గౌరవంగా,  ఉద్వేగంగా  ఆర్‌కే వ్య‌క్తిత్వాన్ని  గుర్తు చేసుకుంటున్నారు.     త‌మ కాలంలో ఇలాంటి వాళ్లు జీవించి ఉండ‌టం   ఎవ‌రికైనా అపురూపమే.  ఆయ‌న రాజ‌కీయాల‌తో త‌మ‌కు  ఏకీభావం లేక‌పోయినా ఆయ‌న నిబ‌ద్ధ‌త గొప్ప‌ది అని నివాళి ప్ర‌క‌టిస్తున్న‌వాళ్లున్నారు.  వ్య‌క్తుల‌తో   రాజ‌కీయ విభేదాలు  ఎన్నో ఉంటాయి. కానీ రాజ‌కీయాల‌కు, భావ‌జాలాల‌కు అతీతంగా  మ‌నుషులు ప‌ర‌స్ప‌రం క‌నెక్ట్ అయ్యేవి అంత‌కంటే ఎక్కువ ఉంటాయి.     స‌మాజంతో విప్ల‌వోద్య‌మానికి  ఈ
కారా స్మృతిలో సాహిత్యం

కారా కథలు ఎందువల్ల నిలుస్తాయి?

వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఒక