చింతామణిపై నిషేధం చెల్లేనా?
సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు. కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై