దండకారణ్యం అప్‌డేట్స్
కొవిడ్ మానవాళికి కొత్త అనుభవం. కరోనా అనంతర చరిత్ర అనగల స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. ఇందులో కొంత విశ్లేషణ ఉంది. చాలా వరకు ఊహ ఉంది. తొలి దశ కరోనా బీభత్సం మధ్యనే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ట్రంప్ దిగిపోయి, జో బిడెన్ అధికారంలోకి వచ్చాడు. ప్రపంచ రాజకీయార్థిక సమీకరణాలు కొత్త దశలోకి మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చినా, బిడెన్ వచ్చినా పాలస్తీనా పరిస్థితి ఏమీ మారదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. ఇజ్రాయిల్‌కు తన ప్రయోజనాల కోసం పోరాటే హక్కు ఉందని