వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
వ్యాసాలు

భారత రాజ్యాంగం వైరుధ్యాల పుట్ట

(రాజ్యాంగంపై  అనేక వైపుల నుంచి చ‌ర్చ జరుగుతున్న‌ది.  దీనికి అమ‌రుడు ప్రొ. శేష‌య్య‌గారు రాసిన ఈ వ్యాసం  త‌ప్ప‌క దోహ‌దం చేస్తుంది.  చారిత్ర‌కంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయ‌న వివ‌రించారు.  మ‌న సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగానికి ఉండ‌వ‌ల‌సిన పాత్ర‌ను ఎత్తిప‌డుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్న‌దీ విశ్లేషించారు.  రాజ్యాంగ ప‌రిశోధ‌కుడిగా, న్యాయ‌శాస్త్ర ఆచార్యుడిగా, పౌర హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిశీల‌న‌లు  ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌కు  కొత్త కోణాలు ఆవిష్క‌రిస్తాయ‌ని పున‌ర్ముద్రిస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,
వ్యాసాలు

మేధావి, సృజనశీలి కామ్రేడ్ మిళింద్

18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ
వ్యాసాలు

చట్టాల ద్వారా ప్రజాస్వామ్యం పై దాడి

భూస్వామ్య సమాజం నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ నడపడానికి చట్టాల నిర్మాణం జరిగింది. కానీ దీంతో పాటు పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోడానికి చట్టాలను  ఉపయోగించుకున్నారనేది కూడా వాస్తవం. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ యుఏపిఏ చట్టం సందర్భంలో  ‘అనేక సార్లు చట్టం స్వయంగా చట్టాన్నే అవహేళన చేస్తుంది’ అని అన్నారు. యుఏపిఏ, దేశద్రోహ చట్టాల సందర్భంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ కూడా ‘భారత పౌరుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలంటే ఈ చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుంది’ అని అన్నారు. దేశంలోని అనేక మంది మేధావులు, రాజ్యాంగ పండితులు,
వ్యాసాలు

రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆర్ధిక స్థితి లో మోడీ-యోగీ ప్రభుత్వం 

 ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య
వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో
వ్యాసాలు

బోనులో మోడీ సర్కార్‌

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' ''ది బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్టు పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్‌ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్‌ కోసం ఎన్‌ఎస్‌వోతో
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,
వ్యాసాలు

పోస్కో దారిలోనే జిందాల్ పోక త‌ప్ప‌దు

నేప‌థ్యంః దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది. ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే