మావోయిస్టురహిత భారత్‌లో 2024 ఎన్నికలు
త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.