వ్యాసాలు దండకారణ్య సమయం

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం
కవిత్వం

రాలిన నక్షత్రాల సాక్షిగా
జనసముద్ర హోరు…

అకాశంలో ఐదు నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా నేల రాలిన వార్త! నన్ను శోక సముద్రాన ముంచెత్తింది! గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది గుండె రాయిలా మారింది! స్పందన లేనట్టు నిశబ్దం నన్ను ఆవరించింది! ఏమీ తోచక అకాశంవైపు చూశాను మేమున్నామంటూ చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు! పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది! అడవి మళ్లీ అంటుకున్నది అ దావానలం కోటి దీపాల వెలుగై చీకటి దారిని చీలుస్తున్నది! నరేంద్రుడు జనప్రభంజనంలో రవితేజంలా వెలుగుతున్నాడు! నిశబ్ద నిశీధి నుండి బయటపడి సముద్రంవైపు చూశాను! సముద్రంలో అల్లకల్లోలం తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన చెట్లు పడిపోతున్నాయి! ఇళ్లు
వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల
సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.
కవిత్వం

కాల్చిన బూడిద కుప్ప కింద

సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి
సంభాషణ

మీరు నడిచినంత మేరా…

‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది. ‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన 'తురక తెలుగులా'.  . తను వచ్చిన పని