ఫాసిస్టు యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మార్చిన స్టాలిన్
దేశభక్తి గల ఒక ఎన్ఆర్ఐ బంధువు స్టాలిన్ గురించి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో నానుంచి జవాబు ఆశించాడు. స్టాలిన్ నాయకత్వమూ, రెండవ ప్రపంచయుద్ధంలో రెండుకోట్లమంది రష్యన్ ప్రజల ప్రాణత్యాగాలే లేకపోతే పాశ్చాత్యదేశాల సోకాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఫాసిజం నుంచి బతికి బయటపడేది కాదని జవాబిచ్చాను. స్టాలిన్ నాయకత్వం అన్నపుడు - అందులో లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్పార్టీ మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి శ్రామికవర్గ విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర ఉన్నది. ఆ విప్లవ విజయకాలం నుంచి (అక్టోబర్ 1917) విప్లవంలోనూ, ఆ తర్వాతకాలంలో లెనిన్ నాయకత్వంలో 1923 దాకా సోషలిస్టు నిర్మాణాలకు వచ్చిన అవరోధాలను పరిష్కరించిన చరిత్ర