మనం
సమూహం
కన్ను తెరిచినప్పుడు


వాడు
స"మూక" ఊకై
కంట్లో నలుసయ్యిండు


లౌకికం తెలియని నాల్క
మనువు నోటితో
లౌకిక విలువల వెలుగుల మీద
చీకటి ఉమ్మేసింది


మెదడు
సభ్యత్వ రుసుం చెల్లించి
కాషాయ వనంలో కండ్లు తెరిచినవాడు
జ్ఞాన పుష్పం ఎలా అవుతాడు?
లోచనా లోతుల్లోకి ఎందుకు తొంగి చూస్తాడు?


వాడికి మనిషి కాదు
మతం మృత కళేబరం ప్రధానం


రాముడి పాదుకా చక్రాలు
మనువు
అధర్మ రథానికి తగిలించుకొని
మతం రోడ్డు మీదుగా
జనం బుర్రల్లోకి నడిపిస్తాడు వాడు


మొరిగే మురుగు మోరీ నోరెళ్ళబెట్టి
పండ్ల శూలాలతో కొరుకుతాడు వాడు


జ్ఞానం గంగలో కలిపి
శీలం చిలుక్కొయ్యలకు తగిలించి
ఏకతకు కాషాయం సుత్తెతో బీటలు పెట్టి
అంద భారత విద్యార్థి పరివారం
సనాతన గోదాట్లో శవమై తేలుతుంది


స్వైర విహార
వెర్రి శునకమై
విద్యారణ్యంలో
నువ్వివ్వాల వెంటబడొచ్చు


నిన్న ఇక్కడ
అంజన్నా... లింగన్నా...నరేషులూ... అనేకులు
నడిచిన అడుగులున్నాయి
వారి పాదాల పాదులున్నాయ్!జాగ్రత్త!!

Leave a Reply